దగదర్తి మండలం మనుబోలుపాడుకు చెందిన 62 ఏళ్ల జనసైనికుడు పాలమాని సుబ్బారావుపై అదే గ్రామానికి చెందిన కేదారి సురేష్, కేదారి రమేష్‌లు పొలం వద్ద దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ దాడిలో కొడవలి, గడ్డపారతో కొట్టడంతో సుబ్బారావు పైపెదవికి తీవ్ర గాయమైందని, మోకాలి ఎముక విరిగిందని సమాచారం.
విషయం తెలుసుకున్న జనసేన పార్టీ కావలి నియోజకవర్గ ఇన్చార్జి అళహరి సుధాకర్ ఆసుపత్రికి వెళ్లి సుబ్బారావును పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు విజ్ఞప్తి.. నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు వినతి మోకాలి శస్త్రచికిత్సను జాగ్రత్తగా నిర్వహించి, బాధితుడు త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.
అనంతరం సీఐతో మాట్లాడి, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జనసేన, లీగల్ సెల్ తరఫున అడ్వకేట్ సర్దార్‌ను సంప్రదించి, బాధితుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటనపై కేసు నమోదు చేసి, విచారణ ద్వారా నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.
ఈ సందర్భంగా సాధు శ్రీధర్, జనసేన రాష్ట్ర మత్స్యకార కార్యదర్శి కోడింగారి శ్రీనివాసులు, అల్లూరు మండలంలో తెలియని బాబాయ్ తదితరులు బాధితుడిని పరామర్శించారు.
