Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
భద్రాద్రి కొత్తగూడెం

మణుగూరుకు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు వస్తే.. ‘మరో ముంబయి’ అయ్యేదా? – సీనియర్ జర్నలిస్టు పి.వి.రావు విశ్లేషణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • మణుగూరు, ఆగస్టు 5: సింగరేణి బొగ్గు ఆధారంగా గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు అమలై ఉంటే మణుగూరు పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందేదని సీనియర్ జర్నలిస్టు పి.వి.రావు అభిప్రాయపడ్డారు.
  • 2007లో ఆస్ట్రేలియాకు చెందిన కార్బన్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ, అనంతరం ఓఎన్‌జీసీ కూడా మణుగూరులో బొగ్గు నుంచి గ్యాస్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులపై ఆసక్తి చూపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
  • 2007 మార్చిలో కార్బన్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ సింగరేణితో ఒప్పందం కుదుర్చుకుని, మణుగూరు ప్రాంతంలోని బొగ్గు నిల్వలపై గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు చేపట్టేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు.

మణుగూరు, ఆగస్టు 5: సింగరేణి బొగ్గు ఆధారంగా గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు అమలై ఉంటే మణుగూరు పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందేదని సీనియర్ జర్నలిస్టు పి.వి.రావు అభిప్రాయపడ్డారు. 2007లో ఆస్ట్రేలియాకు చెందిన కార్బన్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ, అనంతరం ఓఎన్‌జీసీ కూడా మణుగూరులో బొగ్గు నుంచి గ్యాస్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులపై ఆసక్తి చూపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
2007 మార్చిలో కార్బన్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ సింగరేణితో ఒప్పందం కుదుర్చుకుని, మణుగూరు ప్రాంతంలోని బొగ్గు నిల్వలపై గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు చేపట్టేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. తిర్లాపురం నుంచి రామానుజవరం వరకు ఉన్న ప్రాంతాన్ని పరిశీలించి, భూగర్భ బొగ్గు నుంచి మీథేన్, హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులను ఉత్పత్తి చేసే ఆధునిక సాంకేతికతను అమలు చేయాలని ప్రతిపాదించారని పేర్కొన్నారు.
అలాగే 2007 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీలో వెల్లడించిన వివరాల ప్రకారం, సింగరేణి–ఓఎన్‌జీసీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరి, రష్యా సంస్థ సహకారంతో మణుగూరు గనులను కూడా పరిశీలించినట్లు ఆయన గుర్తు చేశారు. అయితే ఈ ప్రాజెక్టులు ఎందుకు నిలిచిపోయాయనే అంశంపై సమగ్ర సమీక్ష అవసరమని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం మణుగూరుకు ఓపెన్‌కాస్ట్–2 డిప్ సైడ్ కోల్ బ్లాక్ లభించిన నేపథ్యంలో, గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల అంశాన్ని మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్మిక సంఘాలు, ప్రజాప్రతినిధులపై ఉందని పి.వి.రావు సూచించారు. ఈ ప్రాజెక్టులు అమలైతే మణుగూరులో పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *