Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

మట్టి గణపతి ముద్దు – పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మట్టి గణపతి ముద్దు – పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత

వెల్లంకి జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల అవగాహన ర్యాలీ

విశాఖపట్నం జిల్లా, ఆనందపురం మండలం, వెల్లంకి (పున్నమి ప్రతినిధి) సెప్టెంబర్ 11:
వినాయక చవితి సందర్భంగా వెల్లంకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు దాడి శెట్టి రమేష్ కుమార్, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులు గ్రామ పురవీధుల్లో ర్యాలీ చేపట్టి పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. “మట్టి వినాయకుణ్ణి పూజిద్దాం–పర్యావరణాన్ని కాపాడుదాం”, “ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వద్దు–మట్టి గణపతే ముద్దు” అంటూ నినాదాలు చేశారు. అనంతరం విద్యార్థులకు మట్టి విగ్రహాలను అందజేశారు. ఈ విగ్రహాలను శ్రీ శుభ బలరాం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్, వ్యవస్థాపకులు పి. జానకేశ్వరరావు అందించారు. కార్యక్రమంలో మాజీ వైస్ సర్పంచ్ కంచరపు శ్రీనివాసరావు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మట్టి గణపతి ముద్దు – పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత

మట్టి గణపతి ముద్దు – పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత

Leave a comment

Your email address will not be published. Required fields are marked *