Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందులో బొజ్జల కుటుంబం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందులో బొజ్జల కుటుంబం

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 03, శ్రీకాళహస్తి నియోజికవర్గ శాసనసభ సబ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మంత్రి నారా లోకేష్ తిరుపతి పార్లమెంట్ కూటమి ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుల కోసం ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ విందులో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తన…
  • ఈ సందర్బంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ....
  • నారా, బొజ్జల కుటుంబాల మధ్య ఉన్న దశాబ్దాల నాటి అనుబంధం ఈ భేటీతో మరోసారి గుర్తుకు వచ్చిందన్నారు.

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 03, శ్రీకాళహస్తి నియోజికవర్గ శాసనసభ సబ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మంత్రి నారా లోకేష్ తిరుపతి పార్లమెంట్ కూటమి ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుల కోసం ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ విందులో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ…. నారా, బొజ్జల కుటుంబాల మధ్య ఉన్న దశాబ్దాల నాటి అనుబంధం ఈ భేటీతో మరోసారి గుర్తుకు వచ్చిందన్నారు. తన తండ్రి స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మధ్య ఉన్న గాఢమైన స్నేహాన్ని, అలాగే లోకేష్ అన్నతో తనకున్న చిన్ననాటి అనుబంధాన్ని ఆత్మీయంగా చర్చించుకున్నామని తన తండ్రి గోపాలకృష్ణ రెడ్డి చేసిన అభివృద్ధి పనులను, నియోజకవర్గంతో ఆయనకు ఉన్న మమేకాన్ని లోకేష్ అన్న ఎంతో గౌరవంగా స్మరించుకోవడం తనకు స్ఫూర్తినిచ్చిందని శ్రీకాళహస్తి జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామి వారి ఆశీస్సులు లోకేష్ అన్న కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ, స్వామి వారి తీర్థ ప్రసాదాలను, శ్రీకాళహస్తి నియోజకవర్గ కళా వైభవాన్ని చాటిచెప్పే “శ్రీ విష్ణు మత్యావతారం” ప్రతిమ, ప్రసిద్ధ గుడిమల్లం టెంపుల్ బుక్ ను లోకేష్ అన్నకు జ్ఞాపికగా బహూకరించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *