Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

మంగళవారిపేట పాఠశాలలను తనిఖీ చేసిన. సర్పంచ్ గొంది సుజాత నాగేశ్వరరావు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మంగళవారిపేట పాఠశాలలను తనిఖీ చేసిన. సర్పంచ్ గొంది సుజాత నాగేశ్వరరావు

ఖానాపురం పున్నమి తెలుగు దినపత్రిక:
విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం.. ఆహార నాణ్యతపై పరిశీలన
మంగళవారిపేట గ్రామంలోని ఉన్నత పాఠశాల మరియు MPPS పాఠశాలలను సర్పంచ్ గొంది సుజాత నాగేశ్వరరావు సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకం అమలును పర్యవేక్షిస్తూ విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను తనిఖీ చేశారు.
అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి విద్యా సంబంధిత సమస్యలు, ఇతర ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారాన్ని అందించాలని పాఠశాల సిబ్బందికి సూచించారు. విద్యార్థుల విద్యాభివృద్ధితో పాటు వారి ఆరోగ్యం, సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.

మంగళవారిపేట పాఠశాలలను తనిఖీ చేసిన. సర్పంచ్ గొంది సుజాత నాగేశ్వరరావు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *