మంగనూరు గ్రామంలో బొడ్రాయి, కర్రెమ్మ, కోట మైసమ్మ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం పాత బొడ్రాయి వద్ద గ్రామ సర్పంచ్ జాలం నాగయ్య దంపతులు ప్రత్యేక హోమ క్రతువు నిర్వహించారు. ఊరి ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని స్వామి, అమ్మవార్లకు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జాలం నాగయ్య యాదవ్‌తో పాటు జాలం కృష్ణయ్య యాదవ్, పినమోని నరసింహ, గుజ్జుల ఆంజనేయులు తదితరులు పాల్గొని అమ్మవార్ల దివ్యానుగ్రహం పొందారు.

వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్