Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఎం.ఏ. లతీఫ్‌కు అవకాశం కల్పించాలి.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఎం.ఏ. లతీఫ్‌కు అవకాశం కల్పించాలి.

వార్త ముఖ్యాంశాలు

  • కాంగ్రెస్ అధిష్ఠానానికి సయ్యద్ లాల్ మియా విజ్ఞప్తి భైంసా: పున్నమి ప్రతినిధి నిర్మల్,: రానున్న రోజుల్లో భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఖాళీ కానున్న నేపథ్యంలో, ఆ పదవికి భైంసా పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మంచిర్యాల జిల్లా మైనారిటీ డిపార్ట్‌మెంట్ అబ్జర్వర్…
  • లతీఫ్ పేరును సానుకూలంగా పరిశీలించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానాన్ని కాంగ్రెస్ నాయకుడు సయ్యద్ లాల్ మియా కోరారు.
  • ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

కాంగ్రెస్ అధిష్ఠానానికి సయ్యద్ లాల్ మియా విజ్ఞప్తి
భైంసా: పున్నమి ప్రతినిధి నిర్మల్,: రానున్న రోజుల్లో భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఖాళీ కానున్న నేపథ్యంలో, ఆ పదవికి భైంసా పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మంచిర్యాల జిల్లా మైనారిటీ డిపార్ట్‌మెంట్ అబ్జర్వర్ ఎం.ఏ. లతీఫ్ పేరును సానుకూలంగా పరిశీలించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానాన్ని కాంగ్రెస్ నాయకుడు సయ్యద్ లాల్ మియా కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎం.ఏ. లతీఫ్ ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తూ, పార్టీ కష్టకాలంలోనూ అండగా నిలిచారని తెలిపారు. భైంసా పట్టణంతో పాటు ముధోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ కోసం దీర్ఘకాలంగా కృషి చేస్తున్న సీనియర్ నాయకులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల సమయంలో పలువురు నాయకులు పార్టీలోకి రావడం, వెళ్లడం సహజమేనని, అయితే ముధోల్ నియోజకవర్గంలో ఎం.ఏ. లతీఫ్ కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతతో పనిచేస్తున్నారని సయ్యద్ లాల్ మియా పేర్కొన్నారు.
పార్టీ బలోపేతం, కార్యకర్తల ఉత్సాహం, ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఎం.ఏ. లతీఫ్‌కు అప్పగించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఎం.ఏ. లతీఫ్ పేరును సానుకూలంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *