Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

భైంసా పట్టణంలో వాణిజ్య శాఖ తనిఖీలు – బంగారు షాపులు మూసేసిన వ్యాపారులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
భైంసా పట్టణంలో వాణిజ్య శాఖ తనిఖీలు – బంగారు షాపులు మూసేసిన వ్యాపారులు

వార్త ముఖ్యాంశాలు

  • భైంసా పట్టణంలో వాణిజ్య శాఖ అధికారులు బంగారు ఆభరణాల దుకాణాలపై ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.
  • పట్టణంలో ఉన్న ప్రధాన బంగారు మార్కెట్‌లో అకస్మాత్తుగా అధికారులు తనిఖీలు ప్రారంభించడంతో వ్యాపారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.తనిఖీల్లో భాగంగా బంగారు ఆభరణాల బరువులు, శుద్ధత, బిల్లు విధానం, హాల్‌మార్క్ నిబంధనలు సక్రమంగా అమలు అవుతున్నాయా లేదా అనే అంశాలను అధికారులు పరిశీలించారు.
  • ఈ క్రమంలో కొంతమంది దుకాణదారులు అవసరమైన పత్రాలు, బిల్లు రికార్డులు సరిగా లేవని గుర్తించినట్లు సమాచారం.తనిఖీల సమాచారం తెలిసిన వెంటనే పట్టణంలోని పలువురు బంగారు షాపులు తక్షణమే షట్టర్లు పడేసి మూసివేసి వెళ్లిపోవడం గమనార్హం.

భైంసా పట్టణంలో వాణిజ్య శాఖ అధికారులు బంగారు ఆభరణాల దుకాణాలపై ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పట్టణంలో ఉన్న ప్రధాన బంగారు మార్కెట్‌లో అకస్మాత్తుగా అధికారులు తనిఖీలు ప్రారంభించడంతో వ్యాపారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.తనిఖీల్లో భాగంగా బంగారు ఆభరణాల బరువులు, శుద్ధత, బిల్లు విధానం, హాల్‌మార్క్ నిబంధనలు సక్రమంగా అమలు అవుతున్నాయా లేదా అనే అంశాలను అధికారులు పరిశీలించారు. ఈ క్రమంలో కొంతమంది దుకాణదారులు అవసరమైన పత్రాలు, బిల్లు రికార్డులు సరిగా లేవని గుర్తించినట్లు సమాచారం.తనిఖీల సమాచారం తెలిసిన వెంటనే పట్టణంలోని పలువురు బంగారు షాపులు తక్షణమే షట్టర్లు పడేసి మూసివేసి వెళ్లిపోవడం గమనార్హం. దీంతో మార్కెట్‌లో ఒకసారిగా నిశ్శబ్దం నెలకొంది.ప్రజల మాటల్లో, ఈ తనిఖీల వలన నిజాయితీగా వ్యాపారం చేస్తున్న దుకాణదారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోనప్పటికీ, అక్రమ రీతిలో లావాదేవీలు నిర్వహిస్తున్న వ్యాపారులపై మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని భావన వ్యక్తమవుతోంది.
వాణిజ్య శాఖ అధికారులు మాట్లాడుతూ – వినియోగదారుల ప్రయోజనాలను కాపాడడమే తమ ముఖ్య ఉద్దేశమని, ఎవరు నిబంధనలు ఉల్లంఘించినా వారిపై తగిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *