Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
భద్రాద్రి కొత్తగూడెం

భద్రాచలంలో నూతన వంతెన పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • భద్రాచలం రూరల్, ఆగస్టు 5: భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న నూతన వంతెన పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం పరిశీలించారు.
  • వంతెన నిర్మాణ పనులను నిర్వహిస్తున్న ఇంజినీర్లతో మాట్లాడిన మంత్రి, పనుల పురోగతిపై వివరాలు తెలుసుకుని నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
  • అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రికి ఘన స్వాగతం పలికారు.

భద్రాచలం రూరల్, ఆగస్టు 5: భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న నూతన వంతెన పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం పరిశీలించారు. వంతెన నిర్మాణ పనులను నిర్వహిస్తున్న ఇంజినీర్లతో మాట్లాడిన మంత్రి, పనుల పురోగతిపై వివరాలు తెలుసుకుని నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. సారపాక మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ కన్నెదారి రమేష్, సర్పంచ్ గుగులోత్ కిషోర్ శిష్టారం నాయక్ పూలబొకే అందజేసి, శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, “భద్రాచలం అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. నూతన వంతెన నిర్మాణం పూర్తయితే ప్రజల రాకపోకలు మరింత సులభతరం అవుతాయి” అని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *