Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

భక్తిశ్రద్ధలతో శ్రీరామ నవమి వేడుకలు-కోదండ రాముని సేవలో బియ్యపు ఆకర్ష్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
భక్తిశ్రద్ధలతో శ్రీరామ నవమి వేడుకలు-కోదండ రాముని సేవలో బియ్యపు ఆకర్ష్

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి, మార్చి 27 (పున్నమి న్యూస్): రేణిగుంట మండలం, గుత్తివారిపల్లి గ్రామంలో వెలసిన శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామ నవమి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి.
  • ఈ వేడుకల్లో భాగంగా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమారుడు బియ్యపు ఆకర్ష్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
  • ఆలయానికి విచ్చేసిన ఆకర్ష్ రెడ్డికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

శ్రీకాళహస్తి, మార్చి 27 (పున్నమి న్యూస్): రేణిగుంట మండలం, గుత్తివారిపల్లి గ్రామంలో వెలసిన శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామ నవమి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమారుడు బియ్యపు ఆకర్ష్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆకర్ష్ రెడ్డికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన సీతారాముల వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు ఆయనకు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనం చేసి, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గణేష్ రెడ్డి, ధనంజయ రెడ్డి, గ్రామ సర్పంచ్ మంజుల, ముని రెడ్డి, సుబ్రహ్మణ్యం మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం అంతా భక్తుల రామనామ స్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *