వార్త ముఖ్యాంశాలు
- సుమారుగా అయిదు దశాబ్దాల క్రితం ఆంధ్ర ప్రదేశ్ లో ఒక గ్రామంలో జరిగిన యదార్ధ సంఘటన స్ఫూర్తితో రాసిన కధ.
- పంచాగ్నుల పరబ్రహ్మ శాస్త్రి ఒక పేరొందిన ప్రవచన కర్త.
- దేవాలయాలలో ఆధ్యాత్మిక ప్రవచనాలు చెబుతూ ఉంటాడు.
సుమారుగా
అయిదు దశాబ్దాల క్రితం
ఆంధ్ర ప్రదేశ్ లో
ఒక గ్రామంలో
జరిగిన యదార్ధ సంఘటన స్ఫూర్తితో రాసిన కధ.
పంచాగ్నుల
పరబ్రహ్మ శాస్త్రి
ఒక పేరొందిన
ప్రవచన కర్త.
దేవాలయాలలో ఆధ్యాత్మిక
ప్రవచనాలు చెబుతూ ఉంటాడు.
గొప్ప పండితుడు.
కానీ ఛాందస వాది.
కుల పట్టింపు ఎక్కువ.
అంటరాని తనాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు.
చెప్పే ప్రవచనాలేమో
చాలా ఉదార వాదిగా ఉంటాయి.
అభ్యుదయం బోధిస్తాడు
కుల రహిత సమాజం రావాలి అని ఉపన్యాసాలు చెబుతాడు.
కానీ తన దాకా వచ్చేసరికి ఒళ్ళంతా కుల పిచ్చి.
భార్య జానకమ్మ
ఒక్కగా నొక్క కొడుకు భవాని శంకర శాస్త్రీ.
పన్నెండు ఏళ్ల వాడు. ఆ వయసులోనే
తండ్రిని
అనేక ధర్మ సందేహాలు
అడుగుతూ ఉంటాడు.
కుల వ్యవస్థ
అంటరాని తనం వ్యతిరేకిస్తూ ఉంటాడు.
శాస్త్రి గారికి ఒక తమ్ముడు ఉంటాడు.
పేరు సత్యం.
అన్న గారిని ఎదిరించి మతాంతర వివాహం చేసుకుంటాడు.
ఒక బావమరిది ఉంటాడు
పేరు గణపతి.
సరదాగా ఉంటాడు.
ఇంకో కీలకమైన పాత్ర ఇంట్లో పనివాడు
పేరు దాసు.
దళితుడు.
దాసు ను శాస్త్రి గారు ఒక అంటరాని వాడి గా చిన్న చూపు చూస్తూ ఉంటాడు.
దాసు కు
భార్య లేదు.
ఒక చంటి బిడ్డ కూతురు ఉంటుంది.
ఒక సందర్భంలో
తమ్ముడు,బావమరిది కలిసి
శాస్త్రి గారిలో మార్పు తీసుకు రావాలి అన్న సదుద్దేశం తో
“నీ కొడుకు నీ సొంత కొడుకు కాదు, నీ పనివాడు దాసు కొడుకు “”అని అబద్ధం చెబుతారు.
ఒక దళితుడి కొడుకు తన వారసుడు కావడం సహించలేక,
శాస్త్రి గారు, భవాని కి విషం ఇచ్చి చంపాలి అని దారుణంగా ఆలోచిస్తాడు.
విషం ఇస్తాడు.
కానీ ఆ విషం తను తాగి,
భవాని ని కాపాడి
ప్రాణ త్యాగం చేస్తాడు దాసు.
శాస్త్రి గారు షాక్ అవుతాడు.
దళితుడు అయిన దాసు చేసిన త్యాగం
ఆయన లో పరివర్తన తెస్తుంది.
కులం కంటే గుణం గొప్పది అని గ్రహిస్తారు.
దాసు కూతురి ని
తన కూతురు గా
దత్తత తీసుకుంటాడు.
భార్య చేతుల్లో పెడతాడు.
దాసు చావు కు తానే కారణం అని ఒప్పుకుని
పోలీసులకు లొంగి పోతాడు.
జైల్ కు వెళ్ళడానికి సిద్ధ పడతాడు.
అంతలోనే
పక్షావాతానికి
గురి అవుతారు.
పాప కర్మ ఫలం అనుభవించక తప్పదు అన్న సందేశం ఇస్తాము.
“కుల రహిత సమాజం ఏర్పడాలి”
మనుషులు అంతా సమానమే
బ్రహ్మమొక్కటే
పర బ్రహ్మమొక్కటే
అన్న ఆదర్శం తో
కధ ముగుస్తుంది.