Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మంచిర్యాల

బోనం ఎత్తిన మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బోనం ఎత్తిన మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి

వార్త ముఖ్యాంశాలు

  • బోనాల పండుగ సందర్భంగా బెల్లంపల్లి పట్టణం రడగంబాల బస్తీలో స్థానిక వార్డ్ కౌన్సిలర్ దామెర విజయ-శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆషాడ మాసం బోనాల కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ స్వాతి రమేష్ బాబు పాల్గొన్నారు.
  • స్థానిక మహిళలతో కలిసి స్వయంగా బోనం ఎత్తుకొని ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
  • ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, నియోజకవర్గంలోని రైతులకు సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు..రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి నాయకత్వంలో ప్రభుత్వం ప్రజాసేవలో మరింత…

బోనాల పండుగ సందర్భంగా బెల్లంపల్లి పట్టణం రడగంబాల బస్తీలో స్థానిక వార్డ్ కౌన్సిలర్ దామెర విజయ-శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆషాడ మాసం బోనాల కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ స్వాతి రమేష్ బాబు పాల్గొన్నారు. స్థానిక మహిళలతో కలిసి స్వయంగా బోనం ఎత్తుకొని ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, నియోజకవర్గంలోని రైతులకు సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు..రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి నాయకత్వంలో ప్రభుత్వం ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మున్సిపల్ చైర్ పర్సన్ ఆకాంక్షించారు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *