Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బోగోలు మండలంలో రెండు పంచాయతీలు ఏకగ్రీవం…మిగిలిన 14 పంచాయతీల్లో ఎన్నికల సందడి.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బోగోలు మండలంలో రెండు పంచాయతీలు ఏకగ్రీవం…మిగిలిన 14 పంచాయతీల్లో ఎన్నికల సందడి.

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి న్యూస్ రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి బోగోలు మండలంలోని మొత్తం 16 గ్రామ పంచాయతీల్లో చెన్నారాయపాలెం, ఏనుగులబావి గ్రామ పంచాయతీలు ఏక గ్రీవమైనట్లు సమాచారం.
  • మిగిలిన 14 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు యథావిధిగా జరగనున్నాయి.
  • మరోవైపు ఎన్నికల అధికారులు అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయించారు.

పున్నమి న్యూస్ రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి

బోగోలు మండలంలోని మొత్తం 16 గ్రామ పంచాయతీల్లో చెన్నారాయపాలెం, ఏనుగులబావి గ్రామ పంచాయతీలు ఏక గ్రీవమైనట్లు సమాచారం. మిగిలిన 14 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు యథావిధిగా జరగనున్నాయి.

మరోవైపు ఎన్నికల అధికారులు అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయించారు. మండలంలోని పలు పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులకు మంచం, కత్తెర, ఉంగరం గుర్తులను అధికంగా కేటాయించారు. అదేవిధంగా వార్డు సభ్యుల అభ్యర్థులకు గౌను, కత్తెర గుర్తులను ఎక్కువ సంఖ్యలో కేటాయించినట్లు తెలిసింది.

**సర్పంచ్ అభ్యర్థులకు 25 గుర్తులు..**

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన గుర్తుల జాబితాలో సర్పంచ్ అభ్యర్థుల కోసం 25 గుర్తులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మంచం, కత్తెర, ఉంగరం, బుట్ట, వంకాయ, కప్పు, తాళం చెవి, కుర్చీ, క్రికెట్ బ్యాట్, టెలిఫోన్, మొక్కజొన్న, ద్రాక్ష, అరటిపండ్లు తదితర గుర్తులు ఉన్నాయి.

**వార్డు సభ్యులకు 20 గుర్తులు..**

వార్డు సభ్యుల అభ్యర్థుల కోసం 20 గుర్తులను కేటాయించారు. వీటిలో ప్రెషర్ కుక్కర్, గౌను, స్టూల్, ఇస్త్రీ పెట్టె, పోస్టు బాక్స్, గ్యాస్ సిలిండర్, బీరువా, ఐస్‌క్రీమ్, కెటిల్, శ్రావణం, విద్యుత్ స్తంభం, డిష్ యాంటెన్నా, కెమెరా, క్యారమ్ బోర్డు, వయోలిన్, బెండకాయ, బెల్టు, కోటు తదితర గుర్తులు ఉన్నాయి.

రెండు పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 14 పంచాయతీల్లో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారనుంది. గుర్తుల కేటాయింపు పూర్తవడంతో అభ్యర్థులు తమ గుర్తులతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రచారానికి సిద్ధమవుతున్నారు. దీంతో బోగోలు మండలంలోని గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *