పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి
బోగోలు బజార్‌లో రహదారి పరిస్థితి అధ్వానంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రహదారిపై భారీగా నీరు నిలిచిపోవడంతో రోడ్డు మొత్తం బురదమయంగా మారింది. రహదారిపై ఏర్పడిన గుంతల్లో వర్షపు నీరు చేరడంతో వాహనదారులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బజార్‌లో నిత్యం వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతుండటంతో ప్రజలు, దుకాణదారులు, ద్విచక్ర వాహనదారులు ఈ సమస్యతో అవస్థలు ఎదుర్కొంటున్నారు. గుంతల్లో నీరు నిలిచిపోవడంతో వాటి లోతు కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం ఉంది. పాదచారులు సైతం బురదలో నడవలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బోగోలు బజార్ రహదారికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టడంతో పాటు, శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

