Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బోగోలు బజార్‌లో నిత్యం ట్రాఫిక్‌ జామ్‌! ,రైల్వే గేటు నంబర్‌ 144 వద్ద వాహనదారుల అవస్థలు ట్రాఫిక్‌ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పోలీసులకు స్థానికుల విజ్ఞప్తి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
బోగోలు బజార్‌లో నిత్యం ట్రాఫిక్‌ జామ్‌! ,రైల్వే గేటు నంబర్‌ 144 వద్ద వాహనదారుల అవస్థలు ట్రాఫిక్‌ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పోలీసులకు స్థానికుల విజ్ఞప్తి

వార్త ముఖ్యాంశాలు

  • బోగోలు బజార్‌లో నిత్యం ట్రాఫిక్‌ జామ్‌!
  • రైల్వే గేటు నంబర్‌ 144 వద్ద వాహనదారుల అవస్థలు ట్రాఫిక్‌ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పోలీసులకు స్థానికుల విజ్ఞప్తి బోగోలు బజార్‌లో గత వారం రోజులుగా ప్రతిరోజూ సాయంత్రం 7 గంటల సమయంలో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతుండటంతో వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
  • ముఖ్యంగా రైల్వే గేట్‌ నంబర్‌ 144 మూసి తిరిగి తెరిచే సమయంలో రహదారికి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోతున్నాయి.

బోగోలు బజార్‌లో నిత్యం ట్రాఫిక్‌ జామ్‌!
రైల్వే గేటు నంబర్‌ 144 వద్ద వాహనదారుల అవస్థలు
ట్రాఫిక్‌ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పోలీసులకు స్థానికుల విజ్ఞప్తి
బోగోలు బజార్‌లో గత వారం రోజులుగా ప్రతిరోజూ సాయంత్రం 7 గంటల సమయంలో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతుండటంతో వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రైల్వే గేట్‌ నంబర్‌ 144 మూసి తిరిగి తెరిచే సమయంలో రహదారికి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోతున్నాయి. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఆలస్యం అవుతోంది. ప్రతిరోజూ సాయంత్రం ఇదే పరిస్థితి నెలకొంటుండటంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. సంబంధిత పోలీసు అధికారులు స్పందించి, సాయంత్రం వేళల్లో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. రైల్వే గేటు వద్ద వాహనాల రద్దీని నియంత్రించి, ట్రాఫిక్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *