వార్త ముఖ్యాంశాలు
- పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బోగోలు మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి.
- ఈ క్రమంలో బోగోలు మండల జడ్పీటీసీ అభ్యర్థిగా కర్తం సురేందర్ రెడ్డి పేరును కావలి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
- ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని సూచించారు.
పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బోగోలు మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో బోగోలు మండల జడ్పీటీసీ అభ్యర్థిగా కర్తం సురేందర్ రెడ్డి పేరును కావలి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ముందుకు సాగుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు రాష్ట్ర కోర్ కమిటి జాయింట్ సెక్రెటరీ మద్దిబోయిన వీర రఘు గారు, మండల అధ్యక్షులు ఉప్పాల మాచర్ల గారు ఇతర మండల నాయకులు పాల్గొన్నారు.