Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బోగోలులో విలేజ్ హెల్త్ క్లినిక్ ను ప్రారంభించిన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి

బోగోలు -1లో విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేస్తోందని ఆయన తెలిపారు.

బోగోలు మండలం వ్యాప్తంగా 14 విలేజ్ హెల్త్ క్లినిక్‌లు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 1,800కు పైగా విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రజారోగ్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ కార్యక్రమంలో బోగోలు మండలం ఎమ్మార్వో సానా శ్రీనివాసులు రెడ్డి గారు, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం గారు, బోగోలు మండలం టిడిపి అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరావు గారు, నాగులవరం పిఎసిఎస్ అధ్యక్షులు చిలకపాటి వెంకటేశ్వర్లు గారు, మండల నాయకులు కోడూరు వెంకటేశ్వర్లు రెడ్డి గారు, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నుకసాని శ్రీనివాసులు యాదవ్ గారు , ఇతర నాయకులు , కార్యకర్తలు , ప్రజలు పాల్గొన్నారు.

బోగోలులో విలేజ్ హెల్త్ క్లినిక్ ను ప్రారంభించిన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు

బోగోలులో విలేజ్ హెల్త్ క్లినిక్ ను ప్రారంభించిన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *