Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బొమ్మరాజుచెరువులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ – లబ్ధిదారులకు పింఛన్లు స్వయంగా అందించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బొమ్మరాజుచెరువులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ – లబ్ధిదారులకు పింఛన్లు స్వయంగా అందించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

వార్త ముఖ్యాంశాలు

  • కలిగిరి నవంబర్ 1న కలిగిరి మండలంలోని నాగసముద్రం పంచాయతీ పరిధిలోని బొమ్మరాజుచెరువు గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు పాల్గొని పింఛన్ లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ అందజేశారు.
  • ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేష్ గారు పింఛన్ లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, కళాకారులు, మరియు స్పోజ్ పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులకు స్వహస్తాలతో పింఛన్లు అందజేశారు.
  • ఆయన ప్రజలతో స్నేహపూర్వకంగా మాట్లాడి, “ప్రతినెలా మీకు పింఛన్ సమయానికి అందుతుందా?

కలిగిరి నవంబర్ 1న

కలిగిరి మండలంలోని నాగసముద్రం పంచాయతీ పరిధిలోని బొమ్మరాజుచెరువు గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు పాల్గొని పింఛన్ లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేష్ గారు పింఛన్ లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, కళాకారులు, మరియు స్పోజ్ పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులకు స్వహస్తాలతో పింఛన్లు అందజేశారు. ఆయన ప్రజలతో స్నేహపూర్వకంగా మాట్లాడి, “ప్రతినెలా మీకు పింఛన్ సమయానికి అందుతుందా? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు?” అని ఆరా తీశారు. లబ్ధిదారులు తమకు ప్రతి నెలా మొదటి తేదీన పింఛన్ సమయానికి అందుతున్నదని తెలిపారు.

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మాట్లాడుతూ —
“గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రజల సంక్షేమం కోసం అనేక సంస్కరణలను అమలు చేస్తున్నారు. వాటిలో ముఖ్యమైనది ఎన్టీఆర్ భరోసా పథకం. ఈ పథకం ద్వారా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, కళాకారులు వంటి అనేక వర్గాలకు గౌరవప్రదమైన జీవనం అందించే విధంగా ప్రతినెలా మొదటి తేదీన పింఛన్ అందించే విధానం ప్రారంభమైంది. ఇది ప్రభుత్వ ప్రజా సంక్షేమ నిబద్ధతకు నిదర్శనం” అని తెలిపారు. ప్రతి ఒక్కరికీ సమయానికి, పారదర్శకంగా పింఛన్ అందేలా ప్రభుత్వం కృషి చేస్తోంది అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ సచివాలయ సిబ్బంది మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *