Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

బొప్పాయి విత్తనాల బ్లాక్‌లపై అరికట్టాలి – రైతు సంఘాల డిమాండ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బొప్పాయి విత్తనాల బ్లాక్‌లపై అరికట్టాలి – రైతు సంఘాల డిమాండ్

వార్త ముఖ్యాంశాలు

  • బొప్పాయి విత్తనాలను బ్లాక్‌లో అమ్మకాలు అరికట్టి, ప్రభుత్వ సబ్సిడీతో రైతులకు సరఫరా చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్.
  • చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పంది కాళ్ల మణి డిమాండ్ చేశారు.
  • వారు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో రైల్వే కోడూరు, రాజంపేట, పీలేరు, మదనపల్లి ప్రాంతాల్లో బొప్పాయి సాగు విస్తృతంగా జరుగుతుందని తెలిపారు.

బొప్పాయి విత్తనాలను బ్లాక్‌లో అమ్మకాలు అరికట్టి, ప్రభుత్వ సబ్సిడీతో రైతులకు సరఫరా చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్. చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పంది కాళ్ల మణి డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో రైల్వే కోడూరు, రాజంపేట, పీలేరు, మదనపల్లి ప్రాంతాల్లో బొప్పాయి సాగు విస్తృతంగా జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం తైవాన్ రెడ్ లేడీ విత్తనాలు కొరత కారణంగా, దళారులు రెట్టింపు ధరకు బ్లాక్‌లో విక్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నాలుగు లక్షలకే లభించిన కిలో విత్తనాలు, ఇప్పుడు ఎనిమిది లక్షలకు అమ్ముతున్నారని, నర్సరీ మొలక ధరలు 11 నుంచి 20 రూపాయలకు పెరిగాయని తెలిపారు. నకిలీ విత్తనాల ముప్పు ఉందని హెచ్చరిస్తూ, ప్రభుత్వం అగ్రికల్చర్, హార్టికల్చర్ శాఖల ద్వారా నాణ్యమైన విత్తనాలను సబ్సిడీతో సరఫరా చేయాలని కోరారు. నర్సరీలపై పర్యవేక్షణ పెంచాలని, పంట బీమా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఐక్యంగా ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *