Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

బొజ్జల కుటుంబ గృహప్రవేశ వేడుకకు పెద్దఎత్తున హాజరైన నాయకులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బొజ్జల కుటుంబ గృహప్రవేశ వేడుకకు పెద్దఎత్తున హాజరైన నాయకులు

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి, మార్చి 14, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తమ స్వగ్రామమైన ఊరందూరులో నిర్మించిన నూతన గృహానికి శనివారం సంప్రదాయబద్ధంగా గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు.
  • ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది.
  • పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య సుధీర్ రెడ్డి దంపతులు గృహప్రవేశం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీకాళహస్తి, మార్చి 14, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తమ స్వగ్రామమైన ఊరందూరులో నిర్మించిన నూతన గృహానికి శనివారం సంప్రదాయబద్ధంగా గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య సుధీర్ రెడ్డి దంపతులు గృహప్రవేశం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ శుభసందర్భంగా నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, పట్టణ ప్రముఖులు, ఎమ్మెల్యే అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరై సుధీర్ రెడ్డి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను ఎమ్మెల్యే ఆత్మీయంగా ఆహ్వానించి ఆతిథ్యం అందించారు. ఎమ్మెల్యేకు ఆప్తమిత్రుడైన తుడా ఛైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్, తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రత్యేకంగా హాజరై బొజ్జల కుటుంబ సభ్యులకు శుభాభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు, బొజ్జల కుటుంబ శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *