బురహాన్పురంలో ఆబాది భూముల రీ- సర్వే
రీ సర్వేకు సహకరించిన గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు
మరిపెడ, అక్టోబర్ 29 (పున్నమి):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీ సర్వే కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని బురహాన్పురం గ్రామ పంచాయతీ పరిధిలో గురువారం ఆబాది భూముల రీ సర్వే నిర్వహించారు. గ్రామంలోని ఇళ్ల స్థలాల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ రీ సర్వే ప్రక్రియను చేపట్టారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పాలనాధికారి రమేష్, గ్రామ పంచాయతీ అధికారి, కార్యదర్శి మంజుల, గ్రామ సర్పంచ్ గుగ్గిల వెంకటమ్మ, ఉపసర్పంచి పెద్ద బోయిన సురేష్ , కెసముద్రం మార్కెట్ వైస్ చైర్మన్ పెద్ద బోయిన ఐలమల్లు, గ్రామ పెద్దలు పాల్గొని రీ సర్వే ప్రక్రియకు సహకరించారు. గ్రామ ప్రజలు తమ ఆబాది ఇంటి స్థలాలకు సంబంధించిన వివరాలను సర్వే సిబ్బందికి అందిస్తూ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
ఈ రీ సర్వే కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ లైసెన్స్డ్ సర్వేయర్లు భూక్య రాము నాయక్, బాదావత్ శివకుమార్ పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఆబాది భూముల వివరాలను క్షేత్రస్థాయిలో నమోదు చేసి, ఇంటి స్థలాల సరిహద్దులు, భూముల వివరాలను గుర్తించే ప్రక్రియను చేపట్టారు.
ప్రభుత్వం చేపట్టిన భూ రీ సర్వే కార్యక్రమం ద్వారా గ్రామాల్లోని ఆబాది భూముల వివరాలను స్పష్టంగా గుర్తించేందుకు, భవిష్యత్తులో భూ సరిహద్దులకు సంబంధించిన సమస్యలను తగ్గించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు,గ్రామ సిబ్బంది ఆబోతు నాన్నయ్య, గుగ్గిళ్ళ వెంకటాద్రి గ్రామ పెద్దలు పాల్గొని రీ సర్వే ప్రక్రియకు సహకరించారు. గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ప్రజలకు సర్వే బృందం కృతజ్ఞతలు తెలిపింది.

వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్