Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

బుధరావుపేటలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బుధరావుపేటలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ

బుధరావుపేటలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ
పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యం: సర్పంచ్ పెసరు రాణి గోవర్ధన్ రెడ్డి
బుధరావుపేట, నవంబర్ 19 (పున్నమి ప్రతినిధి): వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం బుధరావుపేట గ్రామంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు ఎడెల్లి రమేష్‌కు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి గురువారం భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెసరు రాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొని ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీ మోడెం ఎల్లగౌడ్, ఖానాపూర్ మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు చెడిపాక ఉపేందర్, సొసైటీ డైరెక్టర్ చెడిపాక రజిత, చిన్న యాకయ్య, సీనియర్ నాయకులు రామస్వామి, సాంబయ్య, ఎల్లయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

బుధరావుపేటలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *