Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

బీసీ యూత్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మనోహర్‌కు సన్మానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బీసీ యూత్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మనోహర్‌కు సన్మానం

వార్త ముఖ్యాంశాలు

  • ముస్తాబాద్ మార్చి పున్నమి ప్రతినిధి ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ బీసీ సాధికారిత సంఘం యూత్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నూతనంగా నియమితులైన మెంగని మనోహర్‌ను బీసీ సంఘం రాష్ట్ర నాయకులు శీలం స్వామి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
  • ఈ సందర్భంగా శీలం స్వామి మాట్లాడుతూ, మనోహర్ విద్యార్థి ఉద్యమ కారుడిగా విద్యార్థి ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూనే బీసీల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూ రాష్ట్ర స్థాయిలో సేవలందించారని పేర్కొన్నారు.
  • ఆయనకు ఈ బాధ్యతలు రావడం ఆనందకరమని అన్నారు.

ముస్తాబాద్ మార్చి పున్నమి ప్రతినిధి

ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ బీసీ సాధికారిత సంఘం యూత్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నూతనంగా నియమితులైన మెంగని మనోహర్‌ను బీసీ సంఘం రాష్ట్ర నాయకులు శీలం స్వామి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా శీలం స్వామి మాట్లాడుతూ, మనోహర్ విద్యార్థి ఉద్యమ కారుడిగా విద్యార్థి ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూనే బీసీల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూ రాష్ట్ర స్థాయిలో సేవలందించారని పేర్కొన్నారు. ఆయనకు ఈ బాధ్యతలు రావడం ఆనందకరమని అన్నారు.
మనోహర్ మాట్లాడుతూ, బీసీ యువతను చైతన్యం చేస్తూ వారి హక్కుల సాధన కోసం కృషి చేస్తానని, తనపై నమ్మకం ఉంచిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సుద్దాల దేవయ్య, కొమ్మేట రాజు, భూక్య మధు నాయక్, బాలయ్య, పుట్ట చంద్రయ్య, వినయ్, బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *