Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

బి.వి.పురం హైస్కూల్ నందు ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బి.వి.పురం హైస్కూల్ నందు ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 10: శ్రీకాళహస్తి రూరల్ మండలం బి.వి.పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరిధిలోని ఈశ్వరయ్య కాలనీ మోడల్ ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
  • ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు సన్మానించి తమ గౌరవాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బి.వి.పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సునీత గౌడ్ మాట్లాడుతూ..
  • మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను సత్కరించడం తమకు ఎంతో ఆనందదాయకమని తెలిపారు.

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 10: శ్రీకాళహస్తి రూరల్ మండలం బి.వి.పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరిధిలోని ఈశ్వరయ్య కాలనీ మోడల్ ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు సన్మానించి తమ గౌరవాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బి.వి.పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సునీత గౌడ్ మాట్లాడుతూ.. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను సత్కరించడం తమకు ఎంతో ఆనందదాయకమని తెలిపారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గోపి మోహన్, షకీరా, శేఖర్, వెంకట్, ఈశ్వరయ్య కాలనీ మోడల్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *