Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నాగర్‌కర్నూల్

బిజినపల్లి కేజీబీవీలో కలెక్టర్ మెరుపు తనిఖీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బిజినపల్లి కేజీబీవీలో కలెక్టర్ మెరుపు తనిఖీ

వార్త ముఖ్యాంశాలు

  • నాగర్‌కర్నూల్: బిజినపల్లి కస్తూర్బా బాలికల విద్యాలయంలో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ బుధవారం మెరుపు తనిఖీ చేపట్టారు.
  • తరగతి గదుల్లో అభ్యాసన తీరును పరిశీలించి, పాఠశాల పరిసరాలు, వంటగదిని శుభ్రంగా ఉంచాలని సూచించారు.
  • విద్యార్థుల భద్రత, ఆరోగ్యంపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ ఉంచాలన్నారు.

నాగర్‌కర్నూల్: బిజినపల్లి కస్తూర్బా బాలికల విద్యాలయంలో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ బుధవారం మెరుపు తనిఖీ చేపట్టారు. తరగతి గదుల్లో అభ్యాసన తీరును పరిశీలించి, పాఠశాల పరిసరాలు, వంటగదిని శుభ్రంగా ఉంచాలని సూచించారు. విద్యార్థుల భద్రత, ఆరోగ్యంపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ ఉంచాలన్నారు. ప్రభుత్వ మెనూ ప్రకారమే భోజనం పెట్టాలని తేల్చిచెప్పారు. విద్యాబోధనతో పాటు మౌలిక వసతులు సక్రమంగా అందేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మునీరుద్దీన్, ఎంపీడీవో కథలయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *