Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

బిఆర్ఎస్ విమర్శలు ఉనికి కోసమే కాంగ్రెస్ నాయకులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బిఆర్ఎస్ విమర్శలు ఉనికి కోసమే కాంగ్రెస్ నాయకులు

వార్త ముఖ్యాంశాలు

  • రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 5 (పున్నమి ప్రతినిధి) ముస్తాబాద్‌: ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేకే బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రజల్లో ఉనికి కోసం విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు గజ్జెల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లా బాల్‌రెడ్డి, పార్లమెంట్‌ కో-కన్వీనర్‌…
  • ముస్తాబాద్‌లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
  • కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని, ఇందిరమ్మ ఇళ్లకు రూ.5 లక్షల ఆర్థిక సాయం, రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ కార్డుల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు.

రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 5 (పున్నమి ప్రతినిధి)
ముస్తాబాద్‌: ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేకే బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రజల్లో ఉనికి కోసం విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు గజ్జెల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లా బాల్‌రెడ్డి, పార్లమెంట్‌ కో-కన్వీనర్‌ కనమేని చక్రధర్‌రెడ్డి అన్నారు. ముస్తాబాద్‌లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని, ఇందిరమ్మ ఇళ్లకు రూ.5 లక్షల ఆర్థిక సాయం, రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ కార్డుల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. బీఆర్‌ఎస్‌ చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజల మద్దతు కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో కొండం రాజిరెడ్డి, రంజాన్‌ నరేష్‌, ఆరుట్ల మహేష్‌, మిరుదొడ్డి భాను, యాగండ్ల మల్లేష్‌, ఉచ్చిడి బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *