Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

బాసరలో బీజేపీని బలోపేతం చేయాలి: ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బాసరలో బీజేపీని బలోపేతం చేయాలి: ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

వార్త ముఖ్యాంశాలు

  • బాసర: బాసర మండలంలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజల్లో పార్టీకి మరింత ఆదరణ పెంచేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు.
  • బైంసాలోని ఎమ్మెల్యే నివాసంలో బాసర మండల బీజేపీ నాయకులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.
  • ఇటీవల పార్టీ జిల్లా, మండల స్థాయిలో వివిధ పదవులు చేపట్టిన నాయకులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

బాసర: బాసర మండలంలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజల్లో పార్టీకి మరింత ఆదరణ పెంచేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు.
బైంసాలోని ఎమ్మెల్యే నివాసంలో బాసర మండల బీజేపీ నాయకులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల పార్టీ జిల్లా, మండల స్థాయిలో వివిధ పదవులు చేపట్టిన నాయకులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు పటేల్ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నాయకులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బాసర మండలంలో పార్టీ శ్రేణులు మరింత చురుగ్గా పనిచేయాలని సూచించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీతో పాటు సహకార సంఘాల ఎన్నికలు కూడా రానున్న నేపథ్యంలో గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసేందుకు నాయకులు కృషి చేయాలని అన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బాసర మండల బీజేపీ అధ్యక్షుడు పుట్నాల సాయినాథ్, జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు (ఓబీసీ) సుద్ధ సాయిబాబా, జిల్లా కిసాన్ మోర్చా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు దేవునే శంకర్, లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ పోగుల రాజేశ్వర్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు బిద్ధూర్ రమేష్, జిల్లా ఆఫీస్ జనరల్ సెక్రటరీ చౌహన్ గణేష్, జిల్లా బీజేవైఎం ఎగ్జిక్యూటివ్ సభ్యుడు యోగేష్, బాసర మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు బాలాపురం మనోహర్ రావు, మండల బీసీ మోర్చా అధ్యక్షుడు ఆర్. జలంధర్, మండల ఉపాధ్యక్షుడు కొందాపురం గంగాధర్, సీహెచ్. సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *