Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
సాహితీ

బాలిక జీవిత కథానాయిక (కవిత) – డాక్టర్ బద్రి పీర్ కుమార్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బాలిక జీవిత కథానాయిక (కవిత) – డాక్టర్ బద్రి పీర్ కుమార్

వార్త ముఖ్యాంశాలు

  • జాతీయ బాలిక దినోత్సవం (జనవరి24) సందర్భంగా...
  • బాలిక జననం దైవాంశ పూరితం కుటుంబ పుష్టికి ఆనంద భరితం గృహిణిగా చేయూత పరిపూర్ణ చరితం అమ్మాయి నుండి అమ్మ వరకు అమ్మ నుండి అవ్వ వరకు చెల్లి నుండి అక్క వరకు భార్య నుండి బామ్మ వరకు రూపాంతర పరిమళ మాలిక వనితగ మహిళగ జీవితవేదిక…
  • *త* - తను లేనిదే జీవనం నిర్జీవం అని మానవజాతి తలచే దేవత వనిత.

జాతీయ బాలిక దినోత్సవం (జనవరి24) సందర్భంగా…

బాలిక జననం దైవాంశ పూరితం
కుటుంబ పుష్టికి ఆనంద భరితం
గృహిణిగా చేయూత పరిపూర్ణ చరితం

అమ్మాయి నుండి అమ్మ వరకు
అమ్మ నుండి అవ్వ వరకు
చెల్లి నుండి అక్క వరకు
భార్య నుండి బామ్మ వరకు
రూపాంతర పరిమళ మాలిక
వనితగ మహిళగ జీవితవేదిక

*వ* – వయస్సు ఆధారంగా తన ఉనికిని ఉన్నతంగా ఉంచుకుంటూ
*ని* – నిరంతరం తరంతరం కొనసాగిస్తూ…
*త* – తను లేనిదే జీవనం నిర్జీవం అని మానవజాతి తలచే దేవత వనిత.

*మ* – మనిషి పుట్టుటకు మనుగడకు మూలం
*హి* – హితోక్తుల భావజాలానికి బలం
*ళ* – కళాత్మక రూపాలను తీర్చిదిద్దే కలం అసలు సృష్టికే మూలం

ఆప్యాయతలు పంచే సంసార సారిక
అమ్మకు అమ్మయ్యే జీవన గమన దీపిక
మహిళా సాధికారతకు దివ్యౌషధ మూలిక

బాలిక జీవిత మధుర జ్ఞాపిక
తరతరాల సుసంపన్న మాతృక
బాలిక నుండి బాంధవ్య ఏలిక దాక
విధి క్రీడలో అనుసరణీయ భాగ్యరేఖ
స్మరణీయ కమనీయ కాలచక్ర కథానాయిక

Leave a comment

Your email address will not be published. Required fields are marked *