Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బాలాజీనగర్‌లో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 30 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బాలాజీనగర్‌లో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 30 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం

నెల్లూరు: నగరంలోని బాలాజీనగర్‌లో జనసేన పార్టీ రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

జనసేన పార్టీ సీనియర్ నాయకుడు దుగ్గిశెట్టి సుజయ్‌బాబు స్వామివారికి తొలి పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన ఉట్టి కొట్టే మహోత్సవంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పాల్గొని భక్తులను ఉత్సాహపరిచారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన వారికి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు.
జిల్లాలో ఐదు రోజుల పాటు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఏర్పాటు చేసిన పూరీ జగన్నాథ ఆలయ నమూనా, బృందావనంలో కొలువుదీరిన శ్రీకృష్ణుడి ప్రతిమ, దశావతారాల ప్రతిరూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని చెప్పారు. భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా భారీ సెట్టింగ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

నగర ప్రజలు పెద్ద సంఖ్యలో వేడుకలకు తరలివచ్చి శ్రీకృష్ణుడిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. గత మూడు దశాబ్దాలుగా భక్తిశ్రద్ధలతో వేడుకలను నిర్వహిస్తున్న కొట్టే వెంకటేశ్వర్లుకు శ్రీకృష్ణుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించి, మరెన్నో సంవత్సరాలు ఈ సంప్రదాయాన్ని కొనసాగించేలా ఆశీర్వదించాలని ఆకాంక్షించారు.

వేడుకల సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్‌ దీపాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించారు. శ్రీకృష్ణుడి బాల్య ఘట్టాలు, వివిధ రూపాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు భక్తులను ఆకట్టుకుంటోంది. చిన్నారులు, మహిళలు, యువత ఉత్సాహంగా పాల్గొనడంతో బాలాజీనగర్‌ పరిసరాలు పండుగ వాతావరణాన్ని తలపించాయి.

శ్రీకృష్ణుడి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. ఐదు రోజుల పాటు వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

బాలాజీనగర్‌లో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 30 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *