వార్త ముఖ్యాంశాలు
- *భూస్వాములపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి!* *పెద్దగూడూరు మండలం, ఏపూరు గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ నాయకుడు బానోతు రామన్న నాయక్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ, ఆయనను వారి స్వగ్రామంలోని నివాసంలో పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నా* *ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ భీమా…
- పెద్దగూడూరు మండల పరిధిలోని ప్రభుత్వ భూములను కాపాడేందుకు, భూసంబంధిత అక్రమాలను అడ్డుకునేందుకు, వన్ ఆఫ్ 70 చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న అధికారులపై, భూస్వాములపై, రియల్ ఎస్టేట్ మాఫియా కార్యకలాపాలపై బానోతు రామన్న నాయక్ పోరాటం చేస్తున్నారని వారు పేర్కొన్నారు.
- ఈ నేపథ్యంలో ఆయనపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
*భూస్వాములపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి!*
*పెద్దగూడూరు మండలం, ఏపూరు గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ నాయకుడు బానోతు రామన్న నాయక్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ, ఆయనను వారి స్వగ్రామంలోని నివాసంలో పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నా*
*ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ భీమా నాయక్, MCPI కేంద్ర కమిటీ సభ్యులు పానుగంటి నరసయ్య డిమాండ్**
తేదీ:-28/10/2026
📍మహబూబాబాద్ జిల్లా,
పెద్దగూడూరు మండలం
మహబూబాబాద్ జిల్లా పెద్దగూడూరు మండలం ఏపూరు గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ నాయకుడు బానోతు రామన్న నాయక్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని లంబాడి హక్కుల పోరాట సంఘం (LHPS) రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ భీమా నాయక్, ఎంసీపీఐ కేంద్ర కమిటీ సభ్యులు పానుగంటి నరసయ్య అన్నారు.
పెద్దగూడూరు మండల పరిధిలోని ప్రభుత్వ భూములను కాపాడేందుకు, భూసంబంధిత అక్రమాలను అడ్డుకునేందుకు, వన్ ఆఫ్ 70 చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న అధికారులపై, భూస్వాములపై, రియల్ ఎస్టేట్ మాఫియా కార్యకలాపాలపై బానోతు రామన్న నాయక్ పోరాటం చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
బుధవారం పానుగంటి నరసయ్య నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రజల భూములు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం పోరాడుతున్న ఉద్యమ నాయకుడిపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి, దాడికి పాల్పడిన వారితో పాటు వారికి సహకరించినట్లు తేలిన వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. అర్హమైన ఆధారాలు, చట్టపరమైన నిబంధనల ప్రకారం సంబంధిత భూస్వాములపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
**బానోతు రామన్న నాయక్‌పై దాడికి పాల్పడిన వారిని ఎంతటి వారైనా వదిలిపెట్టకూడదని, బాధితుడికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని** వారు స్పష్టం చేశారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే LHPS ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ విలేకరుల సమావేశంలో LHPS పార్లమెంట్ ఇన్చార్జి బానోత్ రాందాస్ నాయక్, LHPS వర్కింగ్ ప్రెసిడెంట్ భానోత్ చందులాల్ నాయక్, DSFI గూడూరు మండల ఇన్చార్జి బానోతు దేవేందర్, DSFI జిల్లా నాయకులు శివవర్మ నాయక్, లావుడియా నవీన్ తదితరులు పాల్గొన్నారు.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్