Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

బాచుపల్లి డివిజన్ క్రాంతి నగర్ కాలనీలో రూ.2 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  • బాచుపల్లి డివిజన్ పరిధిలోని క్రాంతి నగర్ కాలనీలో సీఎంసీ నిధులతో మంజూరైన రూ.2 కోట్ల విలువైన రోడ్లు, పార్క్ అభివృద్ధి మరియు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన…
  • ఈ సందర్భంగా హన్మంతన్న మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, కాలనీల అభివృద్ధికి అవసరమైన ప్రతి పనిని దశలవారీగా పూర్తి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు.
  • ఈ కార్యక్రమంలో నిజాంపేట్ సర్కిల్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, డీసీసీ జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి, మాజీ కార్పొరేటర్ వీరేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు జీవన్ రెడ్డి, మురళి, నర్సింగరావు, కాలనీ సభ్యులు బుగ్గ రెడ్డి, రాజసుర, నవీన్, వంశీ, శ్రీధర్, హరి, కృష్ణ, రఘు తదితరులు…

బాచుపల్లి డివిజన్ పరిధిలోని క్రాంతి నగర్ కాలనీలో సీఎంసీ నిధులతో మంజూరైన రూ.2 కోట్ల విలువైన రోడ్లు, పార్క్ అభివృద్ధి మరియు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా హన్మంతన్న మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, కాలనీల అభివృద్ధికి అవసరమైన ప్రతి పనిని దశలవారీగా పూర్తి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నిజాంపేట్ సర్కిల్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, డీసీసీ జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి, మాజీ కార్పొరేటర్ వీరేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు జీవన్ రెడ్డి, మురళి, నర్సింగరావు, కాలనీ సభ్యులు బుగ్గ రెడ్డి, రాజసుర, నవీన్, వంశీ, శ్రీధర్, హరి, కృష్ణ, రఘు తదితరులు మరియు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *