Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

బయో రిసోర్స్ సెంటర్ పాయింట్ పర్సన్స్‌కు శిక్షణ సుస్థిర జీవనోపాధి, సహజ వనరుల పరిరక్షణపై అవగాహన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
బయో రిసోర్స్ సెంటర్ పాయింట్ పర్సన్స్‌కు శిక్షణ సుస్థిర జీవనోపాధి, సహజ వనరుల పరిరక్షణపై అవగాహన

(పున్నమి న్యూస్)
వేముల మండలం, సెప్టెంబర్ 23:
వేముల మండలంలో బయో రిసోర్స్ సెంటర్ (BRC) పాయింట్ పర్సన్స్‌కు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయం ద్వారా సుస్థిర జీవనోపాధిని ప్రోత్సహించడం, సహజ వనరులను పరిరక్షించడం, మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా జీవనోపాధి అవకాశాలను విస్తరించడం శిక్షణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని వెలుగు–డీఆర్‌డీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆంజనేయులు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బయో రిసోర్స్ సెంటర్లను గ్రామస్థాయిలో మహిళా రైతులు సమర్థవంతంగా వినియోగించుకునేలా పాయింట్ పర్సన్స్ అవగాహన కల్పించాలని సూచించారు. శిక్షణలో పొందిన కషాయాల తయారీ, జీవన ఎరువులు, గ్రోత్ ప్రమోటర్స్, కూరగాయల సాగులో ఏటీఎం, ఏ గ్రేడ్ మోడల్ సాగు, ప్రకృతి వ్యవసాయ సప్త సూత్రాలు, మల్చింగ్, గ్రీన్ కవర్, దేశీ విత్తనాల వినియోగం వంటి అంశాలను మహిళా సంఘాలకు చేరవేసి ఆచరణలోకి తీసుకురావాలని తెలిపారు.

మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాల భాగస్వామ్యంతో కిచెన్ గార్డెన్లు, న్యూట్రి గార్డెన్లు, బయో రిసోర్స్ సెంటర్ల ఏర్పాటు, నిర్వహణ, సహజ వ్యవసాయ పద్ధతులు, సేంద్రియ ఎరువుల తయారీ, వర్మీ కంపోస్ట్, విత్తన సంరక్షణ, నేల–నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

స్థానికంగా లభించే ఆవు పేడ, గోమూత్రం, వివిధ వృక్షజాతుల ఆకులు, కాండాలను వినియోగించి కషాయాలు తయారు చేసుకోవచ్చని తెలిపారు. సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా తక్కువ పెట్టుబడితో సుస్థిర జీవనోపాధి, ఆదాయ అవకాశాలను పెంపొందించుకోవచ్చన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

బయో రిసోర్స్ సెంటర్ల ద్వారా గ్రామీణ మహిళలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ, మార్గదర్శకత్వం అందేలా పాయింట్ పర్సన్స్ చురుకైన పాత్ర పోషించాలని ఏపీఎం ఆంజనేయులు తెలిపారు.

కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం మాస్టర్ ట్రైనర్లు, యూనిట్ ఇన్‌చార్జీలు కృష్ణయ్య, వెంకటేష్, అంజన్‌రెడ్డి, రాంమోహన్ నాయుడు, బయో రిసోర్స్ సెంటర్ యజమానులు రాజీవ్‌రెడ్డి, లక్ష్మీదేవి, జ్యోతి, బీఆర్‌సీ పాయింట్ పర్సన్స్, మహిళా స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు, వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బయో రిసోర్స్ సెంటర్ పాయింట్ పర్సన్స్‌కు శిక్షణ సుస్థిర జీవనోపాధి, సహజ వనరుల పరిరక్షణపై అవగాహన

బయో రిసోర్స్ సెంటర్ పాయింట్ పర్సన్స్‌కు శిక్షణ సుస్థిర జీవనోపాధి, సహజ వనరుల పరిరక్షణపై అవగాహన

బయో రిసోర్స్ సెంటర్ పాయింట్ పర్సన్స్‌కు శిక్షణ సుస్థిర జీవనోపాధి, సహజ వనరుల పరిరక్షణపై అవగాహన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *