Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

ఫుట్ బోర్డు ప్రయాణానికి పుల్ స్టాప్ రద్దీని దృష్టిలో పెట్టుకొని బస్సులు పెంచాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఫుట్ బోర్డు ప్రయాణానికి పుల్ స్టాప్ రద్దీని దృష్టిలో పెట్టుకొని బస్సులు పెంచాలి

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అదనపు సర్వీసులు ఏర్పాటు చేయాలి

విశాఖపట్నం జిల్లా (పున్నమి ప్రతినిధి) ఆగస్టు 12::
ఆనందపురం–తగరపువలస–భీమిలి ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు అధికంగా ఉండటంతో ప్రతిరోజూ వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, ప్రయాణికులు ఆర్టీసీ బస్సులపై ఆధారపడుతున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరుగుతోంది.

బస్సుల్లో స్థలం లేకపోవడంతో కొందరు విద్యార్థులు, ప్రయాణికులు ఫుట్‌బోర్డుపై నిలబడి ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉండటంతో అధికారులు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది.

కాలేజీల రద్దీకి అనుగుణంగా బస్సులు పెంచాలి

ఈ ప్రాంతంలోని కళాశాలల సంఖ్య, విద్యార్థుల రద్దీని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పీక్ అవర్స్‌లో అదనపు బస్సులు, ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా కళాశాలలు ప్రారంభమయ్యే, ముగిసే సమయాలకు అనుగుణంగా బస్సుల ట్రిప్పులను పెంచితే ఫుట్‌బోర్డు ప్రయాణాలను గణనీయంగా తగ్గించవచ్చని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

ప్రయాణికులూ… మీ ప్రాణం మీ చేతుల్లోనే!

బస్సు రద్దీగా ఉందని ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ప్రయాణించడం సాహసం కాదు.. ప్రాణాలతో చెలగాటం. ఒక్క క్షణం నిర్లక్ష్యం కుటుంబాన్ని విషాదంలోకి నెట్టే ప్రమాదం ఉంది. విద్యార్థులు, ప్రయాణికులు కొద్దిసేపు ఆలస్యమైనా సరే తదుపరి బస్సు కోసం వేచి ఉండాలి. బస్సు తలుపుల వద్ద నిలబడకుండా, డ్రైవర్‌, కండక్టర్‌ సూచనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలి.

“బస్సు కోసం కొన్ని నిమిషాలు వేచి ఉండటం మంచిదే.. కానీ ఫుట్‌బోర్డుపై ప్రయాణించి జీవితాన్ని ప్రమాదంలో పెట్టుకోవద్దు.”

ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని అధికారులు బస్సుల సంఖ్య పెంచాలి.. ప్రయాణికులు భద్రతా నియమాలు పాటించాలి. అధికారులు–ఆర్టీసీ–కళాశాల యాజమాన్యాలు–ప్రయాణికులు సమన్వయంతో ముందుకు సాగితే ఫుట్‌బోర్డు ప్రయాణాలకు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు.

ఫుట్ బోర్డు ప్రయాణానికి పుల్ స్టాప్ రద్దీని దృష్టిలో పెట్టుకొని బస్సులు పెంచాలి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *