Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

ఫీల్డ్ ఆఫీసర్ నందకిషోర్‌కు ఘన వీడ్కోలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఫీల్డ్ ఆఫీసర్ నందకిషోర్‌కు ఘన వీడ్కోలు

పున్నమి న్యూస్ ప్రతినిధి (ఆగస్టు 25):
వేముల: వేముల మండలంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించిన నందకిషోర్ బదిలీపై దాడితోట ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు శాఖకు ఫీల్డ్ ఆఫీసర్‌గా వెళ్లారు. ఈ సందర్భంగా వేముల బ్యాంకు శాఖలో ఆయనకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ జయచంద్రుడు మాట్లాడుతూ.. నందకిషోర్ బ్యాంకుకు ఉత్తమ సేవలు అందించడంతో పాటు ఖాతాదారులు, ప్రజల మన్ననలు పొందారని తెలిపారు.

ప్రత్యేక అతిథిగా హాజరైన వెలుగు–డిఆర్డీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆంజనేయులు మాట్లాడుతూ.. వేముల మండలంలోని స్వయం సహాయక సంఘాలకు రుణాల మంజూరులో నందకిషోర్ అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. డ్వాక్రా మహిళలకు వ్యక్తిగత రుణాలు, ఉమెన్ లెడ్ రుణాలు, నారీ శక్తి రుణాలు, లక్పతి దీదీ రుణాల మంజూరులో ఆయన సంపూర్ణ సహకారం అందించారని తెలిపారు. బ్యాంకు–స్వయం సహాయక సంఘాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు.

అనంతరం బ్యాంకు సిబ్బంది నందకిషోర్‌ను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఆయన భవిష్యత్ ఉద్యోగ జీవితంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో వెలుగు సిబ్బంది, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఫీల్డ్ ఆఫీసర్ నందకిషోర్‌కు ఘన వీడ్కోలు

ఫీల్డ్ ఆఫీసర్ నందకిషోర్‌కు ఘన వీడ్కోలు

ఫీల్డ్ ఆఫీసర్ నందకిషోర్‌కు ఘన వీడ్కోలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *