Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

ప్రహరీ లేక ప్రమాదం పొంచి ఉంది.. వెంగళరాజుకుప్పం పాఠశాలపై అధికారులు నిర్లక్ష్యం!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన పాఠశాల వద్దే ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి.పాలసముద్రం మండలం వెంగళరాజుకుప్పం పోస్టాఫీసు సమీపంలోని ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ కొంతకాలం క్రితం తుపాను కారణంగా కూలిపోయింది.అయితే నెలలు గడుస్తున్నా దానిని పునర్నిర్మించకపోవడంతో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.
  • *పక్కనే పెద్ద బావి..
  • మరింత ప్రమాదకరం* కూలిపోయిన ప్రహరీకి సమీపంలోనే పెద్ద బావి ఉండటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.

విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన పాఠశాల వద్దే ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి.పాలసముద్రం మండలం వెంగళరాజుకుప్పం పోస్టాఫీసు సమీపంలోని ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ కొంతకాలం క్రితం తుపాను కారణంగా కూలిపోయింది.అయితే నెలలు గడుస్తున్నా దానిని పునర్నిర్మించకపోవడంతో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

*పక్కనే పెద్ద బావి.. మరింత ప్రమాదకరం*

కూలిపోయిన ప్రహరీకి సమీపంలోనే పెద్ద బావి ఉండటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. పాఠశాల ఆవరణలో చిన్నారులు తిరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు బావి వైపు వెళ్లే అవకాశం ఉందని తల్లిదండ్రులు చెబుతున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకముందే అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

*నెలలు గడుస్తున్నా అధికారుల నుంచి స్పందన ఏదీ?*

ప్రహరీ గోడ కూలిపోయి నెలలు గడుస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం చూపలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ప్రహరీ నిర్మాణంతో పాటు బావి చుట్టూ పటిష్టమైన రక్షణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు వెంటనే పాఠశాలను పరిశీలించి, కూలిపోయిన ప్రహరీని పునర్నిర్మించడంతో పాటు ప్రమాదకర బావిని గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు విద్యార్థి తల్లిదండ్రులు కోరుతున్నారు.

oplus_2097152
oplus_2097152

Leave a comment

Your email address will not be published. Required fields are marked *