వార్త ముఖ్యాంశాలు
- Uploaded Video:
ఆత్మకూరు, ఆగస్టు 20 (పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు నియోజకవర్గంలోని సహజ వనరులను ప్రజా సంపదగా కాకుండా సొంత వనరులుగా భావిస్తూ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఆయన అనుచరులు దోపిడీకి పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపించారు. ప్రజా సమస్యలు, సహజ వనరుల వినియోగం, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తున్న మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు.ఆత్మకూరులోని మేకపాటి విక్రమ్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో పట్టణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్‌రెడ్డి మాట్లాడారు. విక్రమ్‌రెడ్డి ప్రజా సమస్యలపై మర్యాదపూర్వకంగా ప్రశ్నిస్తుంటే ఆయనను ‘బచ్చా’ అంటూ సంబోధించడం రాజకీయ సంస్కృతికి తగదన్నారు. ప్రజల తరఫున ప్రశ్నించే నాయకుడిపై వ్యక్తిగత విమర్శలు చేయడం ద్వారా అసలు అంశాలను పక్కదారి పట్టించలేరని అన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, పనుల నాణ్యత, సహజ వనరుల వినియోగంపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. “మాటలతో బలప్రదర్శన కాదు.. అభివృద్ధి, అవినీతిపై లెక్కలు చెప్పండి. మేము ఆధారాలతో మాట్లాడతాం.. మీరు కూడా ఆధారాలతో సమాధానం చెప్పండి” అని సవాల్ చేశారు.విక్రమ్‌రెడ్డిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆయన స్థాయిని తగ్గించలేరని, ఆత్మకూరు ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు అన్నారు. సమావేశంలో పులిమి రమేష్‌రెడ్డి, బాలిరెడ్డి సుధాకర్‌రెడ్డి, కరిముల్లా, పెమ్మసాని ప్రసన్నలక్ష్మి, పులగం శంకర్‌రెడ్డి, బిజివేముల పిచ్చిరెడ్డి, చండ్రా నారాయణస్వామి, బొమ్మిరెడ్డి రవికుమార్‌రెడ్డి, తోడేటి అశోక్, నందా ఓబులేసు,నోటి వినయ్‌కుమార్‌రెడ్డి, మీరా మొహిద్దీన్, పొంగూరు సుధాకర్, చెరకూరు కామాక్షయ్యనాయుడు, గడ్డం శ్రీనివాసులరెడ్డి, సూరి మదన్‌మోహన్‌రెడ్డి, గుండాల బాలచంద్రారెడ్డి, ఫణికుమార్‌రెడ్డి, బొలిగర్ల వెంకటేశ్వర్లు, పాలేటి వెంగళరెడ్డి, బత్తిన నారాయణరెడ్డి, నందవరం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Uploaded Video: