పామూరు,నవంబర్ 5
పామూరు మండల పరిధిలోని 2026 సాదరణ ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల పోలింగ్ అత్యంత ప్రశాంతమైన వాతావరణం లో ముగిసింది. ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఎక్కడఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా సాగింది. ఉదయం ఏడు గంటలకి పోలింగ్ ప్రారంభం కాగా, ఉదయం నుంచి ఓటర్లు క్యూ లైన్ లలో ఓపికగా నిలబడ్డారు. పురుషులతో సమానంగా మహిళ ఓటర్లు, యువత, వృద్ధులు సైతం ఉత్సాహంగా తరలివచ్చి తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఎన్నికల సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. సమస్యా త్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేకంగా నిఘా ఉంచారు. నిరంతరం పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తూ, శాంతి భద్రతలను కాపాడారు. ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. వృద్ధులకు, దివ్యాంగులకు ఓటు వేయడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. సజావుగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగియడంతో అటు అధికారులు, ఇటు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మండల వ్యాప్తంగా భారీగా పోలింగ్ నమోదనేట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.











