Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రశాంతంగా ముగిసిన పరిషత్ ఎన్నికలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ప్రశాంతంగా ముగిసిన పరిషత్ ఎన్నికలు

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 5 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలో గురువారం నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
  • మండలంలోని 40 పోలింగ్ కేంద్రాల్లో 11 ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు నిర్వహించగా, సుమారు 75 శాతం పోలింగ్ నమోదైంది.
  • వెంకన్నపాలెంలో అత్యధికంగా 85 శాతం ఓటింగ్ నమోదైంది.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 5 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలంలో గురువారం నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మండలంలోని 40 పోలింగ్ కేంద్రాల్లో 11 ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు నిర్వహించగా, సుమారు 75 శాతం పోలింగ్ నమోదైంది. వెంకన్నపాలెంలో అత్యధికంగా 85 శాతం ఓటింగ్ నమోదైంది. పిడూరుపాలెంలో పోలింగ్ ముగిసే సమయానికి 150 మందికి పైగా ఓటర్లు క్యూలైన్లలో ఉండటంతో టోకెన్లు అందించి ఓటు వేసే అవకాశం కల్పించారు. సీఐ కృష్ణారెడ్డి, ఎస్సై హానీఫ్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి, డీఎస్పీ శ్రీనివాసులు ఎన్నికల నిర్వహణను పరిశీలించారు. అధికారులు ఎన్నికలు సజావుగా ముగియడంతో ఊపిరి పీల్చుకున్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *