Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు: మున్సిపల్ కమిషనర్ హెచ్చరిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు: మున్సిపల్ కమిషనర్ హెచ్చరిక

వార్త ముఖ్యాంశాలు

  • నంద్యాల పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీ పరిధిలోని ఐయూడీపీ పథకం (IDSMT) కింద కేటాయించిన భూములను ఆక్రమించినా, అనధికారికంగా బోర్డులు ఏర్పాటు చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని నంద్యాల పురపాలక సంఘం కమిషనర్ ఒక ప్రకటనలో హెచ్చరించారు.గతంలో భూసేకరణ ద్వారా స్వాధీనం చేసుకున్న 94.24 ఎకరాల భూమిని…
  • ప్రస్తుతం ఖాళీగా ఉన్న నంద్యాల విలేజ్ సర్వే నంబర్లు 2311, 2312, 2313, 2314, 2318/A&C, నూనెపల్లె విలేజ్ సర్వే నంబర్లు 410, 411, 412/2 భూములను సెక్షన్ 22-ఎ కింద నిషిద్ధ ఆస్తుల జాబితాలో చేర్చినట్లు పేర్కొన్నారు.
  • ఈ భూములపై న్యాయస్థానంలో కేసులు పెండింగ్‌లో ఉన్నందున, ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని కమిషనర్ స్పష్టం చేశారు.

నంద్యాల పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీ పరిధిలోని ఐయూడీపీ పథకం (IDSMT) కింద కేటాయించిన భూములను ఆక్రమించినా, అనధికారికంగా బోర్డులు ఏర్పాటు చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని నంద్యాల పురపాలక సంఘం కమిషనర్ ఒక ప్రకటనలో హెచ్చరించారు.గతంలో భూసేకరణ ద్వారా స్వాధీనం చేసుకున్న 94.24 ఎకరాల భూమిని మున్సిపాలిటీకి కేటాయించారని తెలిపారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న నంద్యాల విలేజ్ సర్వే నంబర్లు 2311, 2312, 2313, 2314, 2318/A&C, నూనెపల్లె విలేజ్ సర్వే నంబర్లు 410, 411, 412/2 భూములను సెక్షన్ 22-ఎ కింద నిషిద్ధ ఆస్తుల జాబితాలో చేర్చినట్లు పేర్కొన్నారు. ఈ భూములపై న్యాయస్థానంలో కేసులు పెండింగ్‌లో ఉన్నందున, ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని కమిషనర్ స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *