Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శక్తి యాప్‌పై అవగాహన.. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శక్తి యాప్‌పై అవగాహన.. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమాన్ని ఎస్‌ఐ బి.
  • మహేంద్ర నిర్వహించారు.
  • ఈ సందర్భంగా విద్యార్థులు శక్తి యాప్‌ను పూర్తిగా తెలుసుకుని అత్యవసర పరిస్థితుల్లో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఉదయగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమాన్ని ఎస్‌ఐ బి. మహేంద్ర నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శక్తి యాప్‌ను పూర్తిగా తెలుసుకుని అత్యవసర పరిస్థితుల్లో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సెల్‌ఫోన్లకు వచ్చే అనుమానాస్పద లింకులను ఓపెన్ చేసి సైబర్ నేరగాళ్ల బారిన పడవద్దని హెచ్చరించారు. మహిళలు తమ హక్కులు, చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని, విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో దుత్తలూరు ఎస్‌ఐ సుభాషిణి, పోలీసు సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని శక్తి యాప్ వినియోగంపై అవగాహన పొందారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *