Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

ప్రభుత్వం మారింది… పనులు నిలిచాయి..!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • దర్శి: జూన్ 6, 2020 (పున్నమి విలేఖరి): దర్శి వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్మించ తలపెట్టిన శీతల గిడ్డింగి పనులు ముందుకు సాగటం లేదు.
  • దర్శి చుట్టుపక్కల రైతులు మిరప, కంది, పెసర, శనగ, మినుములతో పాటు ఇతర పంటలు విస్తారంగా పండిస్తారు.
  • వాటిని నిల్వచేసుకోవటానికి శీతలగిడ్డింగి కావాలని కోరటంతో తెదేపా హయంలో అప్పటి మంత్రి శిద్దా రాఘవరావు 5 కోట్లు మంజూరు చేశారు.

దర్శి: జూన్ 6, 2020 (పున్నమి విలేఖరి): దర్శి వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్మించ తలపెట్టిన శీతల గిడ్డింగి పనులు ముందుకు సాగటం లేదు. దర్శి చుట్టుపక్కల రైతులు మిరప, కంది, పెసర, శనగ, మినుములతో పాటు ఇతర పంటలు విస్తారంగా పండిస్తారు. వాటిని నిల్వచేసుకోవటానికి శీతలగిడ్డింగి కావాలని కోరటంతో తెదేపా హయంలో అప్పటి మంత్రి శిద్దా రాఘవరావు 5 కోట్లు మంజూరు చేశారు. అనంతరం శీతల గిడ్డంగికి శంకుస్థాపన చేసి భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. వైకాపా అధికారంలోకి రాగానే గిడ్డంగి పనులు నిలిచిపోయాయి. తెదేపా ప్రభుత్వ హయంలో మార్కెట్ యార్డులో గిడ్డంగి అవసరమని ప్రతిపాదనలు పంపిన అధికారులు ఇప్పుడు గిడ్డంగి అవసరమా లేదా అనే అంశంపై ప్రతిపాదనలు పంపాలని కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్థానిక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రైతులు మాత్రం శీతల గిడ్డంగి నిర్మించాలని కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *