ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న తిరువూరు ఆర్డీవో ఏ. కుమార్
తిరువూరు మండలం మల్లాల రెవెన్యూ గ్రామ పరిధిలో ఆర్.ఎస్. నంబర్ 281లో దాఖలా ఉన్న 7 ఎకరాల 58 సెంట్ల ప్రభుత్వ భూమిని తిరువూరు రెవెన్యూ డివిజన్ అధికారి ఏ. కుమార్ గారు పరిశీలించి, ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారు.
సదరు ప్రభుత్వ భూమికి సంబంధించి తదుపరి చర్యలు చేపట్టేందుకు తిరువూరు తహసీల్దార్‌కు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో తిరువూరు తహసీల్దార్, మండల సర్వేయర్, గ్రామ సర్వేయర్ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

