Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
పశ్చిమ గోదావరి

ప్రపంచ దేశాల్లో హిందీ భాష అగ్రస్థానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రపంచ దేశాల్లో హిందీ భాష అగ్రస్థానం

వార్త ముఖ్యాంశాలు

  • భీమవరం : హిందీ భాష నేర్చుకుంటే దేశ నలుమూలల తిరగవచ్చునని, ప్రపంచ దేశాల్లో కూడా హిందీ భాషనే ప్రముఖంగా ఉందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు.
  • భీమవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హిందీ భాష దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీవిజ్ఞానవేదిక అధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ హైస్కూల్ లోని 24 మంది హిందీ ఉపాధ్యాయులను సత్కరించారు.
  • ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ దేవనాగరి లిపిలో వ్రాయబడిన హిందీ భాషను రిపబ్లిక్ ఆఫ్ ఇండియా రెండు అధికారిక భాషలలో హిందీ ఒకటి అని, రెండు అధికారికంగా యూనియన్ స్థాయిలో ఉపయోగించబడతాయని, హిందీని నేడు 250 మిలియన్లకు పైగా ప్రజలు మొదటి భాషగా మాట్లాడుతున్నారన్నారు.

భీమవరం : హిందీ భాష నేర్చుకుంటే దేశ నలుమూలల తిరగవచ్చునని, ప్రపంచ దేశాల్లో కూడా హిందీ భాషనే ప్రముఖంగా ఉందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హిందీ భాష దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీవిజ్ఞానవేదిక అధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ హైస్కూల్ లోని 24 మంది హిందీ ఉపాధ్యాయులను సత్కరించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ దేవనాగరి లిపిలో వ్రాయబడిన హిందీ భాషను రిపబ్లిక్ ఆఫ్ ఇండియా రెండు అధికారిక భాషలలో హిందీ ఒకటి అని, రెండు అధికారికంగా యూనియన్ స్థాయిలో ఉపయోగించబడతాయని, హిందీని నేడు 250 మిలియన్లకు పైగా ప్రజలు మొదటి భాషగా మాట్లాడుతున్నారన్నారు. గత 26 ఏళ్లుగా హిందీ భాషా దినోత్సవాన్ని నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులు రంగ సాయిని అభినందించారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ పట్టణంలోని వివిధ పాఠశాలలోని 24 మంది హిందీ ఉపాధ్యాయులను సత్కరించామని తెలిపారు. కార్యక్రమంలో పొత్తూరి బాపిరాజు, నందమూరి రాజేష్, భట్టిప్రోలు శ్రీనివాసరావు, టివివి ప్రసాద్, వలవల సాయిబాబా, కే మోహిని, ఎస్ సబనా, కామాక్షి, ఎన్ రాధా తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *