Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
BHUPALPALLE

ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ఉచిత ఉపకరణాల కోసం నిర్ధారణ పరీక్షలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ఉచిత ఉపకరణాల కోసం నిర్ధారణ పరీక్షలు

వార్త ముఖ్యాంశాలు

  • జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు అవసరమైన ఉచిత సహాయక ఉపకరణాలను అందించేందుకు అలిమ్కో (Artificial Limbs Manufacturing Corporation of India) మరియు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్ధారణ పరీక్షల శిబిరాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారిణి శ్రీమతి ఎల్.
  • లలిత మరియు కమ్యూనిటీ మొబలైజింగ్ ఆఫీసర్ శ్రీ సామల రమేష్ తెలిపారు.
  • తేదీ: 07-09-2026, సోమవారం వేదిక: జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల, భూపాలపల్లి ఆవరణ ఈ శిబిరంలో గుర్తించబడిన సుమారు 150 మంది ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థినీ, విద్యార్థులకు అవసరమైన సహాయక ఉపకరణాలను ఉచితంగా అందించేందుకు ముందుగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు అవసరమైన ఉచిత సహాయక ఉపకరణాలను అందించేందుకు అలిమ్కో (Artificial Limbs Manufacturing Corporation of India) మరియు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్ధారణ పరీక్షల శిబిరాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారిణి శ్రీమతి ఎల్. లలిత మరియు కమ్యూనిటీ మొబలైజింగ్ ఆఫీసర్ శ్రీ సామల రమేష్ తెలిపారు.

తేదీ: 07-09-2026, సోమవారం
వేదిక: జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల, భూపాలపల్లి ఆవరణ

ఈ శిబిరంలో గుర్తించబడిన సుమారు 150 మంది ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థినీ, విద్యార్థులకు అవసరమైన సహాయక ఉపకరణాలను ఉచితంగా అందించేందుకు ముందుగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఉపకరణాలు అవసరమైన విద్యార్థులు క్రింది ధ్రువపత్రాలను తప్పనిసరిగా వెంట తీసుకొని శిబిరానికి హాజరు కావాలని అధికారులు సూచించారు:

1. పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు – 2 (వైకల్యం స్పష్టంగా కనిపించే విధంగా)
2. 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన వైకల్య ధ్రువపత్రం / SADAREM సర్టిఫికెట్ / సంబంధిత మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా ప్రభుత్వ వైద్యుడు జారీ చేసిన ధ్రువపత్రం
3. ఆధార్ కార్డు
4. ఆదాయ ధ్రువపత్రం లేదా రేషన్ కార్డు

అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, అవసరమైన ధ్రువపత్రాలతో తమ తల్లిదండ్రులతో కలిసి శిబిరానికి హాజరు కావాలని అధికారులు కోరారు.

విద్యార్థినీ, విద్యార్థులతో పాటు వారి తల్లి/తండ్రికి బస్ చార్జీలు మరియు భోజన వసతి కూడా కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.

— జిల్లా విద్యాశాఖాధికారిణి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా

Leave a comment

Your email address will not be published. Required fields are marked *