Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

ప్రజల వద్దకు పాలన జి కొండూరు మండలంలో ప్రజాదర్బార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మైలవరం నియోజవర్గం ఎమ్మెల్యే వసంత కృ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ప్రజల వద్దకు పాలన జి కొండూరు మండలంలో ప్రజాదర్బార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మైలవరం నియోజవర్గం ఎమ్మెల్యే వసంత కృ

ప్రజలవద్దకే పాలన..సమస్యల పరిష్కారమే ప్రజాదర్బార్ లక్ష్యం.
వసంత వెంకట కృష్ణ ప్రసాద్
ప్రజల వినతులు స్వయంగా స్వీకరించిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు.

అధికారులతో సమన్వయం చేస్తూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ.

ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు, అక్టోబర్ 9:

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి సత్వర పరిష్కారం చూపడమే లక్ష్యంగా ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడంతో పాటు, వారి సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ ఒక కీలక వేదికగా నిలుస్తోందని పేర్కొన్నారు.

శుక్రవారం జి.కొండూరు గ్రామంలోని కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలతో తన వద్దకు వచ్చిన ప్రజలతో మాట్లాడి, వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, సమస్య స్వభావాన్ని బట్టి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ప్రజలు ఇబ్బందులు పడకుండా, తమ సమస్యలను నేరుగా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చే అవకాశం ప్రజాదర్బార్ కల్పిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజలు అందించిన వినతులపై అధికారులు బాధ్యతాయుతంగా స్పందించి, పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలను అన్వేషించడమే ప్రజాదర్బార్ ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు స్పష్టం చేశారు. ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ, అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) గారు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నార

ప్రజల వద్దకు పాలన జి కొండూరు మండలంలో ప్రజాదర్బార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మైలవరం నియోజవర్గం ఎమ్మెల్యే వసంత కృ

ప్రజల వద్దకు పాలన జి కొండూరు మండలంలో ప్రజాదర్బార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మైలవరం నియోజవర్గం ఎమ్మెల్యే వసంత కృ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *