వార్త ముఖ్యాంశాలు
- నిర్మల్: నిర్మల్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్‌ను వెంటనే ప్రారంభించాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ డిమాండ్ చేశారు.
- పార్టీ నాయకులతో కలిసి బ్లాక్‌ను సందర్శించి పరిశీలించగా, సుమారు 25 శాతం పనులు అసంపూర్తిగా ఉండటంతో పాటు వెంటిలేటర్లు వంటి కీలక వైద్య పరికరాలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్నట్లు తెలిపారు.
- నాలుగు రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పిన ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే ఇప్పటికీ ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు.
నిర్మల్: నిర్మల్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్‌ను వెంటనే ప్రారంభించాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ డిమాండ్ చేశారు. పార్టీ నాయకులతో కలిసి బ్లాక్‌ను సందర్శించి పరిశీలించగా, సుమారు 25 శాతం పనులు అసంపూర్తిగా ఉండటంతో పాటు వెంటిలేటర్లు వంటి కీలక వైద్య పరికరాలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్నట్లు తెలిపారు. నాలుగు రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పిన ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే ఇప్పటికీ ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. రాజకీయ ఆరోపణలు పక్కనపెట్టి, పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీ.హెచ్. వినోద్, సాధిక్, బైండ్ల శ్రీనివాస్, మెరుగు రాజన్న, చుక్కలా భూమన్న, శీతల్కార్ అరవింద్ తదితరులు పాల్గొన్నారు.