Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మేడ్చల్ – మల్కాజిగిరి

ప్రజల అవసరాలను తీర్చడమే ప్రథమ లక్ష్యo అభివృద్ధే మా ప్రాధాన్యం : బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రజల అవసరాలను తీర్చడమే ప్రథమ లక్ష్యo అభివృద్ధే మా ప్రాధాన్యం : బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్

వార్త ముఖ్యాంశాలు

  • ఈరోజు 125 - గాజులరామారం డివిజన్ పెద్దమ్మ నగర్ లో దాదాపు 1.12 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా చేపట్టనున్న సిసి రోడ్డు పనులకు బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ శంకుస్థాపన చేశారు.
  • ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....
  • ప్రజల అవసరాలను తీర్చడమే తమ ప్రథమ లక్ష్యమని, అభివృద్ధే ప్రాధాన్యతగా పనిచేస్తున్నామని అన్నారు.

ఈరోజు 125 – గాజులరామారం డివిజన్ పెద్దమ్మ నగర్ లో దాదాపు 1.12 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా చేపట్టనున్న సిసి రోడ్డు పనులకు బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….
ప్రజల అవసరాలను తీర్చడమే తమ ప్రథమ లక్ష్యమని, అభివృద్ధే ప్రాధాన్యతగా పనిచేస్తున్నామని అన్నారు.
గత 12 ఏళ్ల కాలంలో పెద్దమ్మ నగర్ బస్తీలో త్రాగునీటి సౌకర్యం, భూగర్భ డ్రైనేజీ సదుపాయంతో పాటు అనేక సమస్యలను పరిష్కరించి నేడు సీసీ రోడ్డు పనులను ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, రానున్న రోజుల్లో కూడా పెద్దమ్మ నగర్ బస్తి అభివృద్ధికి నా సహాయ సహకారాలు ఉంటాయన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు, పెద్దమ్మ నగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దండుగుల నవీన్, ఉపాధ్యక్షులు దస్తగిరి ఖాన్, మనోహర్, ప్రధాన కార్యదర్శి రమేష్, సంయుక్త కార్యదర్శి జి ఎస్. శ్రీనివాస్, కోశాధికారి ఎండి. ఆరిఫ్, కె.రాము, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఎస్. గోపాల్, పాక్స్ డైరెక్టర్ పరుశ శ్రీనివాస్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు విజయరామ్ రెడ్డి, సీనియర్ నాయకులు అడ్వకేట్ కమలాకర్, ఇబ్రహీం ఖాన్, తెలంగాణ సాయి, సాయిబాబా, నాగేష్, సుంకరి చందు, ఇమ్రాన్ బేగ్, చెట్ల వెంకటేష్, మూసాఖాన్, బోయిని మహేష్, చిన్న చౌదరి, బాబీ చౌదరి, ప్రసాద్, శ్రావణ్, అరుణ్, రాములు గౌడ్, శివా నాయక్, సమ్మయ్య యాదవ్, ఆసిఫ్, హమీద్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *