Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు : సీఎం చంద్రబాబు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు : సీఎం చంద్రబాబు
Oplus_131072

వార్త ముఖ్యాంశాలు

  • ప్రతి ఇంటా భక్తిశ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
  • విఘ్నాలను తొలగించి విజయాలను అందించేలా వినాయక చవితిని ఊళ్లు, కాలనీలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా వాడవాడలా అన్ని వర్గాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.
  • అన్ని వర్గాల ప్రజలను ఒక్కచోట చేర్చే గొప్ప సామాజిక పండుగ వినాయక చవితి.

ప్రతి ఇంటా భక్తిశ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. విఘ్నాలను తొలగించి విజయాలను అందించేలా వినాయక చవితిని ఊళ్లు, కాలనీలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా వాడవాడలా అన్ని వర్గాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అన్ని వర్గాల ప్రజలను ఒక్కచోట చేర్చే గొప్ప సామాజిక పండుగ వినాయక చవితి. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మట్టి వినాయక ప్రతిమలను పూజిస్తూ, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ మన సంస్కృతి, సంప్రదాయాలను మరింత వైభవంగా కొనసాగిద్దాం. ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఎటువంటి ఆటంకాలు ఎదురవ్వకుండా ఆశీర్వదించాలని గణనాథుడిని వేడుకుంటున్నాను. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *