Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

ప్రక్కిలంక సబ్ స్టేషన్ మెయింటెనెన్స్ – వ్యవసాయ విద్యుత్ సరఫరాలో తాత్కాలిక అంతరాయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రక్కిలంక సబ్ స్టేషన్ మెయింటెనెన్స్ – వ్యవసాయ విద్యుత్ సరఫరాలో తాత్కాలిక అంతరాయం

వార్త ముఖ్యాంశాలు

  • తాళ్లపూడి( పున్నమి ప్రతినిధి )ఫిబ్రవరి 19:ప్రక్కిలంక 33/11 కేవీ సబ్ స్టేషన్‌లో మెయింటెనెన్స్ పనుల నేపథ్యంలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యవసాయ విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్.
  • నారాయణ అప్పారావు ప్రకటించినట్టు తాళ్లపూడి ఎలక్ట్రికల్ ఏఈ జి.
  • శ్రీనివాసరావు తెలిపారు.

తాళ్లపూడి( పున్నమి ప్రతినిధి )ఫిబ్రవరి 19:ప్రక్కిలంక 33/11 కేవీ సబ్ స్టేషన్‌లో మెయింటెనెన్స్ పనుల నేపథ్యంలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యవసాయ విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్. నారాయణ అప్పారావు ప్రకటించినట్టు తాళ్లపూడి ఎలక్ట్రికల్ ఏఈ జి. శ్రీనివాసరావు తెలిపారు.
అయితే రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉదయం 3 గంటల నుండి 8 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా అందుబాటులో ఉంటుందని తెలిపారు.
ఈ పనుల కారణంగా ప్రక్కిలంక సబ్ స్టేషన్ పరిధిలోని ప్రక్కిలంక, తాడిపూడి, కుకునూరు, వేగేశ్వరపురం, బల్లిపాడు, పోచవరం, రాగోలపల్లి, తుపాకులగూడెం, గజ్జరం, వీరభద్రపురం గ్రామాలకు వ్యవసాయ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుంది.
కావున మెయింటెనెన్స్ పనులకు రైతులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *