Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మహబూబాబాద్

పౌరసరఫరాల శాఖ మహబూబాబాద్‌ జిల్లా మేనేజర్‌కు 100 కోట్ల ఆస్తులు!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పౌరసరఫరాల శాఖ మహబూబాబాద్‌ జిల్లా మేనేజర్‌కు 100 కోట్ల ఆస్తులు!

వార్త ముఖ్యాంశాలు

  • పౌరసరఫరాల శాఖలో జిల్లా మేనేజర్‌గా పనిచేస్తున్న అధికారి ఏకంగా రూ.100 కోట్ల ఆస్తులను కూడబెట్టారు.
  • అది కూడా..
  • ఇన్‌చార్జి మేనేజర్‌గా అదనపు బాధ్యతల్లో ఉన్న అసిస్టెంట్‌ మేనేజర్‌ కావడం గమనార్హం.

పౌరసరఫరాల శాఖలో జిల్లా మేనేజర్‌గా పనిచేస్తున్న అధికారి ఏకంగా రూ.100 కోట్ల ఆస్తులను కూడబెట్టారు. అది కూడా.. ఇన్‌చార్జి మేనేజర్‌గా అదనపు బాధ్యతల్లో ఉన్న అసిస్టెంట్‌ మేనేజర్‌ కావడం గమనార్హం.
పౌరసరఫరాల శాఖ మహబూబాబాద్‌ జిల్లా మేనేజర్‌కు 100 కోట్ల ఆస్తులు!
Mahabubabad ACB raids
నరసింహారావు నివాసాల్లో ఏసీబీ సోదాలు
ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు గుర్తింపు

అధికారిక లెక్కల్లోనే రూ.9.41 కోట : పౌరసరఫరాల శాఖలో జిల్లా మేనేజర్‌గా పనిచేస్తున్న అధికారి ఏకంగా రూ.100 కోట్ల ఆస్తులను కూడబెట్టారు. అది కూడా.. ఇన్‌చార్జి మేనేజర్‌గా అదనపు బాధ్యతల్లో ఉన్న అసిస్టెంట్‌ మేనేజర్‌ కావడం గమనార్హం. మహబూబాబాద్‌ జిల్లా మేనేజర్‌గా పనిచేస్తున్న వాసంశెట్టి నరసింహారావు.. అవినీతి, అక్రమ మార్గాల ద్వారా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణలపై అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 13(1)(బి) రెడ్‌విత్‌ 13(2) కింద ఆయనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.ఈ మేరకు శుక్రవారం ఆయన నివాసంతోపాటు మహబూబా బాద్‌లోని కార్యాలయం, బంధువులు, బినామీలకు సంబంధించిన ఏడు చోట్ల సోదాలు నిర్వహించి భారీగా ఆస్తులను గుర్తించారు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల బహిరంగ మార్కెట్‌ విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని ఏసీబీ అధికారులు అంతర్గత సంభాషణల్లో పేర్కొంటున్నారు. అధికారిక లెక్కల ప్రకారమే ఈ ఆస్తుల విలువ రూ.9,41,06,975 ఉంటుందని ఏసీబీ డీజీ చారుసిన్హా ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఖమ్మం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కీలక పోస్టులో పనిచేసిన నరసింహారావుకు ఆ జిల్లాలోని బల్లెపల్లి, రఽఘునాథపాలెం, వెలుగుమట్లలో ఐదు ఓపెన్‌ ప్లాట్లు 1,230.16 గజాల విస్తీర్ణంలో ఉన్నాయని, వీటి డాక్యుమెంట్‌ విలువ రూ.30,72,000 అని వెల్లడించారు.
బినామీ పేరిట భారీగా ఆస్తులు..
సూర్యాపేట జిల్లా కల్మలచెరువు వద్ద 1.08 ఎకరాలు, నిజామాబాద్‌ జిల్లా సిరికొండలో 21.3 ఎకరాలు, నమవరంలో 5.31 ఎకరాల చొప్పున రెండు పొలాలు నరసింహారావు పేరిట, ఆయన మామ పేరిట ఉన్నట్లు గుర్తించామని ఏసీబీ అధికారులు తెలిపారు. వీటి డాక్యుమెంట్‌ విలువ రూ.1,17,01,895గా పేర్కొన్నారు. సిరికొండలోని 21.3 ఎకరాల భూమి డాక్యుమెంట్‌ విలువ రూ.76 లక్షలు కాగా, దీని అగ్రిమెంట్‌ విలువ రూ.6,54,75,000 అని వెల్లడించారు. నమవరంలో ఒక్కో భూమి డాక్యుమెంట్‌ విలువ రూ.19,25,000 కాగా, అగ్రిమెంట్‌ విలువ రూ.1.92 కోట్లు అని తెలిపారు.
ఖమ్మం జిల్లా కవిరాజ్‌నగర్‌లో జీ-ప్లస్‌ 2 భవనం, జీ-ప్లస్‌ 4 ఆర్‌సీసీ భవనం, హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌, బైరామల్‌గూడ సాగర్‌ ఎన్‌క్లేవ్‌లో మూడు అంతస్తుల ఇల్లు నరసింహారావు, ఆయన భార్య, మామ పేరిట ఉన్నాయని ఏసీబీ అధికారులు వివరించారు. వీటి డాక్యుమెంట్‌ విలువ రూ.1.58 కోట్లు అని పేర్కొన్నారు. నరసింహారావు ఇంట్లోని మూడు వాహనాల విలువ రూ.20 లక్షలు ఉంటుందని, గృహోపకరణాల విలువ రూ.33.48,400గా గుర్తించామని తెలిపారు. అంతేకాకుండా ఆయన ఇంట్లో రూ.9,39,321 విలువ చేసే 360 గ్రాముల బంగారు ఆభరణాలు, 331 గ్రాముల వెండి వస్తువులను గుర్తించామని, వీటి విలువ రూ.9,39,321 ఉంటుందని వెల్లడించారు. మొత్తం ఆస్తుల విలువ డాక్యుమెంట్‌ ప్రకారం రూ.9,41,06,975 ఉందన్నారు.
టెక్నికల్‌ అసిస్టెంట్‌గా విధుల్లో చేరి..
నరసింహారావు అదనపు ఆస్తులు, బినామీ లెక్కలపై విచారణ జరుగుతోందని, బినామీ పేరిట ఒక రైస్‌మిల్లును కూడా ఆయన కొన్నట్లు అనుమానిస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ విషయం ఇంకా నిర్ధారణ కావాల్సి ఉందన్నారు. నరసింహారావు బ్యాంకు ఖాతాలు, లాకర్ల వివరాల పరిశీలన కొనసాగుతుందన్నారు. కొన్ని వ్యాపారాల్లోనూ నరసింహారావుకు లావాదేవీలు ఉన్నట్లుగా గుర్తించామని ఏసీబీ ఖమ్మం డీఎస్పీ రమేష్‌ ప్రకటించారు. కాగా, 2011లో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా విధుల్లో చేరిన నరసింహారావు ఖమ్మం, నిర్మల్‌ ప్రాంతాల్లో పనిచేశారని, 15 ఏళ్లుగా విధుల్లో ఉంటూ ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టినట్టు గుర్తించామపి తెలిపారు. ఖమ్మంలోని నివాసంలో కొంత నగదు, బంగారంతోపాటు ఖరీదైన మద్యం బాటిళ్లు కూడా గుర్తించామని, ఇంకా అన్ని చోట్ల తనీఖీలు పూర్తయిన తరువాత వివరాలు వెల్లడిస్తామని అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *